హెల్త్ టిప్స్

దాల్చినచెక్కతో రుతుక్రమ నొప్పులకు చెక్‌!

దాల్చినచెక్క అనగానే ఏ రకమైన డిష్‌ తయారుచేస్తున్నారో అనుకుంటారు. ఇది వంటలకే కాదు పలురకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాల్చినచెక్క తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మహిళలు రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. ఇది ఒకరోజుతో పోయే సమస్య కాదు ప్రతీనెలా ఎదుర్కోవాల్సిన సమస్య. ఈ నొప్పి తట్టుకోలేక చాలామంది కడుపునొప్పి టాబ్లెట్‌ వేసుకుంటారు. ఇది ఆ కొంత సమయం నొప్పి నుంచి ఉపశమన్నాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో మరో సమస్యను సృష్టించగలదు. అలాంటి బాధ నుంచి ప్రతీనెలా తప్పించుకోవడానికి కొన్ని సలహాలు పాటించండి.

1. బియ్యం కడిగిన నీటిలో మూడుస్పూన్ల దాల్చినచెక్క పొడి వేసుకొని తాగితే సరిపోతుంది. ఈ పద్ధతి వెంటనే నొప్పి తగ్గించకపోయినా కొంతసేపటికి మాత్రం ఫలితం ఉంటుంది.

many wonderful health benefits of cinnamon how to use it

2. ఒక్కోసారి కొంతమందికి గుండె పట్టేసినట్లు ఉంటుంది. ఆ సందర్భాలలో దాల్చినచెక్కను చూర్ణం చేసి అందులో కొద్దిగా యాలకులపొడి వేసి నీటిలో మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కషాయం రూపంలో తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు.

3. తలనొప్పి తగ్గాలంటే దాల్చినచెక్కను పొడిచేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకుంటే సరిపోతుంది. దాల్చినచెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి రోజూ మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.

4. చర్మరోగాలు, దురదలు, చెమట పొక్కులు, ఎగ్జిమా వంటివి తగ్గాలంటే కొద్దిగా తేనెను వేడిచేసి అందులో రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని వేసి ఆ మిశ్రమాన్ని తీసుకున్నా లేదా చర్మానికి రాసుకున్నా ఫలితం ఉంటుంది.
5. రాత్రి నిద్రించే ముందుగా గ్లాస్‌ పాలలో రెండు స్పూన్ల దాల్చినచెక్కపొడి, కొద్దిగా చక్కెర వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని తాగితే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.

Admin

Recent Posts