హెల్త్ టిప్స్

ఉల్లికాడ‌ల‌తో ఆశ్చ‌ర్య‌పోయే హెల్త్ సీక్రెట్స్‌..

ఉల్లికాడల ఖరీదు తక్కువే. ఉల్లిపాయల్ని కొనలేక, తినలేక బాధపడుతున్నాం అనుకునే వాళ్లకి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. పోషకాల పరంగా చూసినా ఇవెంతో ఉపయోగపడతాయి. అయితే ఉల్లి కాడలను ఆహారపదార్ధాల తయారీలో ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడరు. దీన్ని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం వల్ల‌ పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది తప్పు అంటున్నారు నిపుణులు.

వీటిని ఆహారపదార్థాల్లో ఉపయోగించడం వల్ల‌ ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని వారు చెబుతున్నారు. అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ఉల్లికాడలు ఓ దివ్య ఔషధంగా పనిచేస్తాయ‌ట‌. కూరల్లో వాటిని వేసుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుండె, రక్తనాళాలకు ఉల్లికాడలు బాగా ఉపయోగపడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ ఆక్సీకరణను తగ్గిస్తాయి. దీనిలో పుష్కలంగా ఉండే సల్ఫర్‌ కాంపౌండ్‌ బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది.

many wonderful health benefits of spring onions how to use them

దీనిలో ఉండే సి విటమిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లికాడల్లో ఉండే పెక్టిన్ ముఖ్యంగా పెద్ద పేగు కాన్సర్‌ వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇవి కీళ్ళ నొప్పులు, ఉబ్బసం చికిత్సకు బాగా ఉపయోగపడతాయి. ఉల్లికాడల్లో ఉన్న క్రోమియం కంటెంట్‌ మధుమేహం నుంచి కాపాడుతుంది.ఉల్లికాడలు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు దీనిలోని స్థూలపోషకాలు జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి.

కళ్ళ జబ్బులు, కాళ్ళ సమస్యలు ఉన్నవాళ్లు ఉల్లికాడలు తినడం మంచిది. దీనిలో ఉండే అల్లసిన్‌ చర్మానికి మంచి చేస్తుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. శరీరంలో గ్లూకోజ్‌ శక్తిని పెంచుతుంది. దీనిలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్‌ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సహకరిస్తుంది. అజీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి అవసరమైన యాంటి బ్యాక్టీరియల్‌ లక్షణాలనూ అందిస్తాయి. ఇది బ్లడ్‌ షుగర్‌ను నియంత్రిస్తుంది.

Admin