నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు నిత్యం వివిధ సందర్భాల్లో మానసిక ఒత్తిళ్లను, ఆందోళనలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. దీనికి తోడు పలు అనారోగ్య సమస్యలు కూడా అందరినీ కామన్‌గా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అలాంటి వాటిలో లైంగిక సామర్థ్యం కూడా ఒకటి. రోజంతా కష్టపడి అలసిన శరీరానికి సాంత్వన కలిగించేది దంపతుల మధ్య శృంగారమే. కానీ నేటి తరుణంలో వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల కారణంగా పడకగదిలో సరిగ్గా తమ శక్తిని చూపించలేకపోతున్నారు. ఈ క్రమంలో దంపతుల శృంగార జీవితం కూడా ఏమాత్రం ఆసక్తికరంగా ఉండడం లేదు. అయితే కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను దంపతులు నిత్యం తమ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో వారి శృంగార శక్తి రెట్టింపు అవుతుంది. మళ్లీ ఎప్పటిలా ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఆ ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లిని నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే దాంతో లైంగిక శక్తి పెరుగుతుంది. పురుషుల్లో అయితే వీర్యం ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. కణాలు నాణ్యంగా కూడా ఉంటాయి. ఆలిసిన్ అనే పదార్థం వెల్లుల్లిలో ఉండడమే ఇందుకు కారణం. అవకాడోలలో అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శృంగార పటిమను పెంచుతాయి. అంతేకాదు పురుషుల్లో అంగ స్తంభన సమస్యను తొలగిస్తాయి. చాకొలేట్‌లో కోకో ఎక్కువగా ఉంటుంది. ఇది ఆ శక్తిని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యం తగుమోతాదులో అల్లాన్ని ఆహారంలో భాగంగా తింటూ ఉన్నా శృంగార శక్తిని పెంచుకోవచ్చు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరిగేలా చూస్తాయి.
నిత్యం ఉసిరికాయను ఏదో ఒక విధంగా తినడం అలవాటు చేసుకుంటే పురుషుల్లో వీర్య నాణ్యత పెరుగుతుంది. లైంగిక పటుత్వం కూడా వస్తుంది. స్త్రీ, పురుషులిద్దరిలో ఉండే సెక్సు హార్మోన్లను ప్రేరేపించడంలో ఆల్చిప్పలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తింటుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఆస్పారగస్‌లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంటిక పటుత్వాన్ని పెంచుతుంది.
అశ్వగంధ పొడి (మార్కెట్‌లో దొరుకుతుంది) తో తయారు చేసిన టీని తాగుతుంటే లైంటిక శక్తి బాగా పెరుగుతుంది. దీంతో పాటు పురుషుల్లో ఉండే అంగ స్తంభన సమస్య పోతుంది.