Moringa Leaves Juice : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే మనం సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం. నేటి తరుణంలో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, రక్తహీనత, క్యాల్షియం లోపం, కంటి చూపు మందగించడం, తరచూ అనారోగ్య సమస్యల బారిన పడడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ అనారోగ్య సమస్యల నుండి బయట పడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. ఎటువంటి ఖర్చులేకుండా కేవలం మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
దాదాపుగా మనకు వచ్చే అనారోగ్య సమస్యలన్నింటిని దూరం చేసే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి….అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం అర కప్పు మునగాకును, పావు కప్పు కరివేపాకును, అర చెక్క నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో మునగాకును, కరివేపాకును తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఇందులో తేనె, నిమ్మరసం వేసి కలిపి తాగాలి. షుగర్ వ్యాధితో బాధపడే వారు తేనెను తీసుకోకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఇలా వారం రోజుల పాటు తాగిన తరువాత మరో వారం రోజులు గ్యాప్ ఇచ్చి తాగాలి. ఈ విధంగా ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది. రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కండరాలు ధృడంగా తయారవుతాయి. రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. అధిక బరువుతో బాధపడే వారు ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా మునగాకు, కరివేపాకుతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడంతో పాటు వాటి బారిన కూడా పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.