Phool Makhana Milk : ప్రస్తుత రోజుల్లో మనలో చాలా మంది నీరసం, అలసట, బలహీనత, నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వారు మనలో చాలా మంది ఉన్నారు. అలాగే ఎముకలు బలహీనంగా మారడం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో కూడా మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమస్యలన్నింటిని మనం ఒక చక్కటి చిట్కా ద్వారా నయం చేసుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. శరీరానికి చక్కటి శక్తిని ఇచ్చే ఈ చిట్కా ఏమిటి.. దీనిని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఫూల్ మఖనాను, గసగసాలను, పాలను ఉపయోగించాల్సి ఉంటుంది. తామర గింజల నుండి తయారు చేసే ఫూల్ మఖనా మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తుంది. చాలా మంది వీటితో కూరను తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఫూల్ మఖనాలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఫూల్ మఖనాలో కార్బోహైడ్రేట్స్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన ప్రోటీన్ ను అందించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇలా అనేక రకాలుగా ఫూల్ మఖనా మనకు ఉపయోగపడుతుంది.
అదే విధంగా గసగసాలు కూడా ఎన్నో పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. సహజ సిద్దమైన పెయిన్ కిల్లర్ గా ఇవి పని చేస్తాయి. గుంగె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తి సక్రమంగా పని చేసేలా చేయడంలో, నాడీ మండల వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో గసగసాలు ఎంతో దోహదపడతాయి. నిద్రలేమి, ఎముకలకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారు గసగసాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. కీళ్ల నొప్పులు, నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడే వారు వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గ్లాస్ పాలల్లో ఒక కప్పు ఫూల్ మఖనా, ఒక టీ స్పూన్ గసగసాలు వేసి పాలను వేడి చేయాలి. తరువాత ఈ పాలను గ్లాస్ లోకి తీసుకోవాలి.
రుచి కొరకు ఇందులో పటిక బెల్లం వేసుకోవచ్చు. అయితే డయాబెటిస్ తో బాధపడే వారు పటిక బెల్లాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఈ విధంగా తయారు చేసుకున్న పాలను తాగుతూ ఫూట్ మఖనాను, గసగసాలను నమిలి తినేయాలి. ఈ విధంగా రాత్రి పడుకోవడానికి అరగంట తీసుకోవాలి. వారంలో మూడు నుండి నాలుగు సార్లు ఈ విధంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. నొప్పులు తగ్గుతాయి. శరీరానికి కావల్సిన పోషకాలు లభించి నీరసం, బలహీనత దూరమవుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి. రాత్రి పడుకునే ముందు ఈ పాలను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ విధంగా పాలు, ఫూల్ మఖనా, గసగసాలను తీసుకోవడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.