కిస్మిస్ (ఎండు ద్రాక్షలు) లలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్, మనిరల్స్ వీటిల్లో ఉంటాయి. అయితే వీటిని నేరుగా తినడం కన్నా రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తినాలి. అలాగే వాటిని నానబెట్టిన నీటిని కూడా తాగాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* రాత్రి పూట ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్‌లను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి, ఆ కిస్మిస్‌లను తినడం వల్ల లివర్ శుభ్రం అవుతుంది. చిన్న పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలబద్దకం ఉన్నవారికి మేలు జరుగుతుంది.
* కిస్మిస్‌ల నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హైబీపీ అదుపులోకి వస్తుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తం శుద్ధి అవుతుంది.
* సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల ప్రకారం నిత్యం కిస్మిస్‌లను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
* జీర్ణ సమస్యలు ఉన్నవారు కిస్మిస్ నీటిని తాగితే మేలు జరుగుతుంది. అజీర్ణం సమస్య పరిష్కారం అవుతుంది.
* కిస్మిస్‌లలో ఉండే విటమిన్ బి, సిలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
* కిస్మిస్‌లలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.
* రక్తహీనత సమస్య ఉన్నవారు కిస్మిస్ నీటిని తాగితే ఫలితం ఉంటుంది. రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది.