ఆయిల్ పుల్లింగ్‌ను చాలా మంది చేయడం లేదు. కానీ ఇది పురాతనమైన పద్ధతే. దీన్ని నిత్యం అనుసరించడం వల్ల మనకు పలు లాభాలు కలుగుతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఆయిల్ పుల్లింగ్‌ను చేయాలి. దంతధావనం చేశాక నోట్లో కొబ్బరినూనెను కొద్దిగా పోసుకుని 10 నిమిషాల పాటు నోట్లో ఆ నూనెను అటు ఇటు కదిలిస్తూ ఉండాలి. 10 నిమిషాల తరువాత నూనెను ఉమ్మేయాలి. మింగకూడదు. ఇలా ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల పలు ప్రయోజనాలను పొందవచ్చు.
* ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* నోటి దుర్వాసన ఉండదు. నోట్లో బాక్టీరియా నశిస్తుంది.
* దంతాలు తెల్లగా మారుతాయి.
* దంతాలు, చిగుళ్లలో ఇరుక్కుని ఉండే పదార్థాలు బయటకు వస్తాయి. దీని వల్ల దంతాలు, చిగుళ్లు శుభ్రమవుతాయి.
* శరీరం హార్మోన్లను సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.
* తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తగ్గుతాయి.