Rice Water : రోజూ మనం ఉదయం వివిధ రకాల టిఫిన్లు చేస్తుంటాం. కానీ మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం అయితే అన్నమే తింటాం. బియ్యంతో అన్నం వండుతారు. అయితే చాలా మంది బియ్యాన్ని చాలా కడిగి మరీ అన్నం వండుతారు. ఈ క్రమంలో అలా బియ్యం కడిగిన నీళ్లను అందరూ పారబోస్తారు. అయితే వాస్తవానికి వాటితో మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బియ్యాన్ని మంచినీళ్లతో కడగాలి. అనంతరం ఆ నీళ్లను పారబోయకుండా పక్కన పెట్టాలి. ఈ నీళ్లతో మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం కడిగిన నీళ్లను మనం కాస్త వేడి చేసి అందులో నిమ్మరసం, తేనె వంటివి కలిపి తాగవచ్చు. దీని వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యంలో ఉంటాయి. శరీరం కోల్పోయిన ద్రవాలు, మినరల్స్ మళ్లీ మనకు లభిస్తాయి. ఇక బియ్యం కడిగిన నీళ్లను తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. విరేచనాలు అయిన వారు, పొట్టలో అసౌకర్యం కలిగిన వారు ఈ నీళ్లను తాగితే సత్వరమే ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారికి బియ్యం కడిగిన నీళ్లు వరమనే చెప్పవచ్చు. వీటితో క్యాలరీలు తక్కువగా లభిస్తాయి.
అన్నంకు బదులుగా బియ్యం కడిగిన నీళ్లను తాగవచ్చు. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. దీంతో శరీరంలో క్యాలరీలు ఎక్కువగా చేరవు. ఫలితంగా బరువు తగ్గడం సులభతరం అవుతుంది. బియ్యం కడిగిన నీళ్లను వాడడం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తుగా, దృఢంగా పెరిగి కాంతివంతంగా మారుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. ఈ నీళ్లను తాగితే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఈ నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. ఇలా బియ్యం నీళ్లతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.