Roasted Garlic For Fat : మనలో చాలా మంది పొట్ట, నడుము, తొడలు, పిరుదులు వంటి వివిధ శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. చాలా మంది శరీర భాగాల్లో పేరుకపోయిన ఈ కొవ్వును కరిగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఖర్చూ లేకుండా అలాగే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాల్సి ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు మన వంటింట్లో ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి.
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు మన శరీరంలో మెటబాలిజాన్ని పెంచడంలో సహాయపడతాయి. మెటబాలిజం చక్కగా ఉంటే మనం తిన్న ఆహారం కొలెస్ట్రాల్ గా మారకుండా ఉంటుంది. అలాగే మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయడంలో కూడా ఈ వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంలో, గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా చేయడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా వెల్లుల్లి మనకు ఉపయోగపడుతుంది.
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు, మలినాలు తొలగిపోతాయి. రక్తం పలుచగా తయారవుతుంది. అలాగే శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడంలో కూడా వెల్లుల్లి మనకు ఎంతో దోహదపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు వెల్లుల్లి రెబ్బలను ఇనుప కళాయిలో లేదా పెనం మీద వేసి వేయించాలి. వెల్లుల్లి రెబ్బలు రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలను రోజూ ఉదయం పరగడుపున రోజుకు ఒకటి చొప్పున తినాలి. వెల్లుల్లి రెబ్బలు చిన్నగా ఉంటే రోజుకు రెండు రెబ్బలు తినాలి. అదే వెల్లుల్లి రెబ్బలు పెద్దగా ఉంటే రోజుకు ఒకటి తినాలి.
అయితే ఈ వెల్లుల్లి రెబ్బలను బాగా నమిలి తినాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు తిన్న తరువాత ఒక గ్లాస్ వేడి నీటిలో తేనె కలుపుకుని తాగాలి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలను వేయించి తీసుకున్న వెంటనే ఒక గ్లాస్ వేడి నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.