Saffron Tea : మనకు సులభంగా లభించే పదార్థాలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈ టీని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అధిక బరువు సమస్యతో నేటికాలంలో మనలో చాలా మంది బాధపడుతున్నారు. వయసులో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, సుఖమయ జీవితానికి అలవాటు పడడం, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం వంటి వివిధ కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
దీని కారణంగా బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, థైరాయిడ్, కీళ్ల నొప్పులు, పైల్స్, మోకాళ్ల నొప్పులు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు మన చుట్టూ ముడతాయి. కనుక ఈ మనం సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య నుండి బయటపడడం ఉత్తమం. అధిక బరువు సమస్య నుండి బయటపడాలని మార్కెట్ లో లభఙంచే అనేక రకాల మందులను, పొడులను, జ్యూస్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కానీ వీటిని వాడడం వల్ల మనం భవిష్యత్తుల్లో అనేక రకాల దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మనం వీలైనంత వరకు సహజంగా ఈ సమస్య నుండి బయట పడడానికి ప్రయత్నించాలి.
అధిక బరువుతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే విధంగా టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా బరువును తగ్గించుకోవచ్చు. ఈ టీ తయారీలో వాడేపదార్థాలన్నీ కూడా సహజ సిద్దమైనవే. అలాగే ఇవి అన్నీ కూడా మయనకు సులభంగా లభిస్తాయి. ఈ టీ ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అధిక బరువును తగ్గించే ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన దార్థాలు ఏమిటి..అలాగే ఈ టీని ఎలా వాడాలి..అన్న వివరాలను తెలుసుకుందాం. ఈ టీని తయారు చేసుకోవడానికి గానూ అర టీ స్పూన్ కుంకుమ పువ్వును, ఒక గ్లాస్ నీటిని, 10 పుదీనా ఆకులను, ఒక ఇంచు దంచిన అల్లం ముక్కను, రెండు నిమ్మకాయ ముక్కలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి 10 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నీరు గోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి రోజూ ఉదయం తీసుకోవాలి. ఇలా టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి మనం సన్నగా, నాజుకుగా మారవచ్చు. అంతేకాకుండా ఈ టీని తాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. అలాగే ఈ టీని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉండవచ్చు.