Coconut Oil : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక్క టీస్పూన్ కొబ్బ‌రినూనె.. అంతే..! స‌క‌ల రోగాల‌కు చెక్‌..!

Coconut Oil : ఆయుర్వేద ప్రకారం కొబ్బ‌రినూనెలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. కొబ్బ‌రినూనెతో కొన్ని ప్రాంతాల్లో వంట‌లు చేస్తుంటారు. అయితే కొబ్బ‌రినూనెతో చేసే వంట‌కాలు చాలా మందికి రుచించ‌వు. కానీ కొబ్బ‌రినూనె దివ్యౌష‌ధం అని చెప్ప‌వ‌చ్చు. దీంతో చేసే వంట‌కాల‌ను తిన‌లేని వారు నేరుగా ఈ నూనెను తీసుకోవ‌చ్చు. రోజూ రాత్రి పూట నిద్ర‌కు ముందు కేవ‌లం ఒక్క టీస్పూన్ కొబ్బ‌రినూనెను తీసుకున్నా చాలు.. అమోఘ‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

take one teaspoon full of Coconut Oil  before bed everyday for these benefits
Coconut Oil

1. కొబ్బ‌రినూనెలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొవ్వును క‌రిగేంచేందుకు స‌హాయ ప‌డ‌తాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ముఖ్యంగా పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది.

2. కొబ్బ‌రినూనెలో ఉండే మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతో శ‌ర‌రీంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కొబ్బ‌రినూనె ఎంత‌గానో మేలు చేస్తుంది. దీంతో హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి. దీని వ‌ల్ల మ‌హిళ‌లకు కూడా ఎంతో ఉప‌యోగం ఉంటుంది. వారికి నెల‌స‌రి స‌రిగ్గా వ‌స్తుంది.

3. కొబ్బ‌రినూనెలో కాప్రిక్ యాసిడ్‌, లారిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి ఫంగ‌స్‌, ఈస్ట్ ఇన్‌ఫెక్ష‌న్ల‌పై ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల ఈ నూనెను తీసుకుంటే వివిధ ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. ముఖ్యంగా జ‌న‌నావ‌య‌వాల్లో వ‌చ్చే ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. ఆ భాగం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది.

4. కొబ్బ‌రినూనె తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది.

5. కొబ్బ‌రినూనెను తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ రాత్రి ఈ నూనెను తీసుకుంటే మ‌రుస‌టి రోజు ఉద‌య‌మే సుఖంగా విరేచ‌నం అవుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. జీర్ణాశ‌యం, పేగులు మొత్తం శుభ్రంగా మారుతాయి.

గ‌మ‌నిక‌ : కొబ్బరినూనెను తాగితే కొంద‌రికి ప‌డ‌దు. అలాంటి వారికి వెంట‌నే విరేచ‌నాలు అవుతాయి. క‌నుక డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు దీన్ని వాడుకోవ‌డం మంచిది.

Share
Admin

Recent Posts