Immunity Power : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక్క టీస్పూన్ తినండి చాలు.. రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది..!

Immunity Power : ప్ర‌స్తుతం మ‌నం ఉన్న ప‌రిస్థితుల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అత్యంత క‌ష్టంగా మారింది. మ‌న కుటుంబంలో ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అయితే చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌ల‌కు రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డ‌మే కార‌ణ‌మ‌వుతోంది. ఈ శ‌క్తి త‌క్కువగా ఉండ‌డం వ‌ల్ల అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నారు. కొంద‌రు ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే కింద చెప్పిన విధంగా చేస్తే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే..

take these mixture daily on empty stomach to increase Immunity Power
Immunity Power

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు ఒక మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకుని రోజూ తీసుకోవాలి. ఆ మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక నిమ్మ‌కాయ‌, 10 వెల్లుల్లి రెబ్బ‌లు, 100 గ్రాముల అల్లం, 200 గ్రాముల తేనెల‌ను తీసుకోవాలి. ఒక పాత్ర తీసుకుని అందులో ముందుగా వెల్లుల్లి రెబ్బ‌ల‌ను దంచి వేయాలి. త‌రువాత అల్లంను తురిమి దాన్ని ఆ పాత్ర‌లో వేయాలి. అనంత‌రం తేనెను పోయాలి. చివ‌రిగా ఒక నిమ్మ‌కాయ‌ను కోసి దాని నుంచి పూర్తిగా ర‌సం తీసి ఆ మొత్తం ర‌సాన్ని ఆ పాత్ర‌లో పోయాలి. అనంత‌రం అన్నింటినీ బాగా క‌ల‌పాలి.

ఇలా క‌లిపి సిద్ధం చేసుకున్న మిశ్ర‌మాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోవాల్సి ఉంటుంది. ఉద‌యం ప‌ర‌గ‌డుపునే ఈ మిశ్ర‌మాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని తినాలి. త‌రువాత ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే కేవ‌లం వారం రోజుల్లోనే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే ఈ మిశ్ర‌మాన్ని ఒకేసారి నెల‌కు త‌యారు చేసుకుని రోజూ తిన‌వ‌చ్చు. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డ‌మే కాదు.. హైబీపీ త‌గ్గుతుంది. కొలెస్ట్రాల్‌, షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఈ మిశ్ర‌మంతో అనేక ర‌కాల ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే నెల రోజుల పాటు తీసుకున్న త‌రువాత 10 రోజులు విరామం ఇచ్చి మ‌ళ్లీ దీన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే పైన చెప్పిన విధంగా అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts