Vamu Water : వాము నీటిని ఇలా తాగితే.. ఎన్నో లాభాలు.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Vamu Water : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి, బాణ పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డానికి అనేక ర‌కాల డైట్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల డైట్ ప‌ద్ద‌తుల‌ను పాటించిన‌ప్ప‌టికి స‌మ‌స్య త‌గ్గ‌క అనేక ర‌కాల ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటారు. ఎటువంటి మందుల‌ను , ఆహార నియ‌మాల‌ను పాటించే ప‌ని లేకుండా చాలా సుల‌భంగా మ‌న ఇంట్లో ఉండే ఒక అద్భుత‌మైన ఔష‌ధాన్ని ఉప‌యోగించి మ‌నం అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. ఈ ఔష‌ధాన్ని చ‌క్క‌గా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం షుగ‌ర్ వ్యాధిని కూడా నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. మోకాళ్ల నొప్పుల‌తో, కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు కూడా ఈ ఔష‌ధాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించే ఈ ఔష‌ధం ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే ఈ ఔష‌ధ‌మే వాము… వాము ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉంటుంది. వాము చ‌క్క‌టి రుచితో పాటు ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఎంతో కాలంగా దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. మ‌న శ‌రీరంలో వాత‌, క‌ఫ‌, దోషాల‌ను తొల‌గించ‌డంలో వాము మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. వాతం వ‌ల్ల ముందుగా మ‌న శ‌రీరంలో గ్యాస్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. గ్యాస్ స‌మ‌స్యే క‌దా అని చాలా మంది తేలిక‌గా తీసుకుంటారు. కానీ గ్యాస్ స‌మ‌స్య వ‌ల్ల మ‌న‌కు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు అనేకం తలెత్తుతాయి. ఈ గ్యాస్ స‌మ‌స్య కార‌ణంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, క‌డుపు నొప్పి వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Vamu Water benefits in telugu take daily like this
Vamu Water

అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యే ఈ గ్యాస్ స‌మ‌స్య‌ను మ‌నం మ‌న ఇంట్లో ఉండే వామును ఉప‌యోగించి త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే ఈ వామును ఉప‌యోగించ‌డం వల్ల మ‌నం ఎసిడిటీ, త్రేన్పులు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లను త‌గ్గించుకోవ‌డంతో పాటు షుగ‌ర్, బీపీ వంటి వ్యాధుల‌ను కూడా నియంత్రించుకోవ‌చ్చు. దాదాపు మ‌న శ‌రీరంలో వ‌చ్చే 80 శాతం రోగాల‌ను ఈ వామును ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు. అయితే ఈ వామును ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వామును నీటితో, పాల‌తో లేదా నేరుగా ఉప్పుతో క‌లిపి నోట్లో వేసుకుని న‌మ‌ల‌వ‌చ్చు. ఈ వామును వంట‌ల్లో లేదా మ‌జ్జిగ‌లో వేసుకుని తీసుకోవ‌చ్చు. అలాగే రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక ఒక టేబుల్ స్పూన్ వామును వేసి రాత్రంతా అలాగే ఉంచాలి.

ఉద‌యాన్నే ఈ నీటిని తాగి వామును న‌మిలి మింగాలి. ఈ విధంగా వామును తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట త‌గ్గుతుంది. బ‌రువు త‌గ్గ‌డానికి వాము ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఇలా త‌యారు చేసుకున్న వాము నీటిని కొద్దిగా వేసి అందులో బ్లాక్ సాల్ట్ ను వేసి క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్, ఎసిడిటి, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు, అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు ఈ వాము నీటిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ వాము నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ విధంగా వామును తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌ట్ట‌డంతో పాటు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

D

Recent Posts