Capsicum Tomato Masala Curry : క్యాప్సికం అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేస్తే.. మొత్తం తినేస్తారు..!

Capsicum Tomato Masala Curry : క్యాప్సికంతో కూడా మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. క్యాప్సికంతో చేసే వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ వంట‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. క్యాప్సికంతో చపాతీ అలాగే అన్నంలోకి తినేలా ట‌మాటాలు వేసి మ‌సాలా క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాప్సికంతో ఈ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన క్యాప్సికం – 250 గ్రా., త‌రిగిన ట‌మాటాలు – 250 గ్రా., త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీస్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Capsicum Tomato Masala Curry recipe in telugu very easy to make
Capsicum Tomato Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాలకులు – 3,ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1.

ట‌మాట క్యాప్సికం త‌యారీ విధానం..

ముందుగా మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌ను ఒక జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాప్సికం ముక్క‌లు వేసి రెండు నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఈ నూనెలో అల్లం పేస్ట్, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత మ‌సాలా పేస్ట్ ను వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ట‌మాట ముక్క‌లు ఉడికిన త‌రువాత వేయించిన క్యాప్సికం ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి.

త‌రువాత అర గ్లాస్ నీటిని పోసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట క్యాప్సికం క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు క్యాప్సికంతో ఇలా ట‌మాటాలు వేసి మ‌సాలా కూర‌ను కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts