Weight Loss Foods : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. బ‌రువు త‌గ్గ‌డం ఎంత తేలికంటే..?

Weight Loss Foods : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డాల‌ని మ‌న‌లో చాలా మంది ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. అధిక బ‌రువు వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతూ ఉంటాయి. క‌నుక‌ అధిక బ‌రువు నుండి ఎంత త్వ‌ర‌గా బ‌య‌టప‌డితే అంత మంచిది. చాలా మంది బ‌రువు త‌గ్గాల‌ని ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. అనేక ర‌కాల డైట్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. ఇలా డైట్ ప‌ద్ద‌తుల‌ను పాటించ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గిన‌ప్ప‌టికి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు స‌రిగ్గా అంద‌వు. పోష‌కాహార లోపం త‌లెత్తుతుంది. రోజుకు 1000 క్యాల‌రీల కంటే త‌క్కువ ఆహారాన్ని అస్స‌లు తీసుకోకూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌నం తీసుకునే ఆహారం కంటే మ‌నం ఎక్కువ క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేసిన‌ప్పుడే మ‌నం బ‌రువు త‌గ్గ‌గ‌ల‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

క‌నుక వీలైనంత వ‌ర‌కు ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నించాలి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ప్రోటీన్స్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌డంతో పాటు మ‌నం కూడా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు 6 ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని వారు సూచిస్తున్నారు. ఈ ఆరు ర‌కాల ఆహార ప‌దార్థాలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉండేవే. బ‌రువు త‌గ్గ‌డంతో పాటు శ‌రీరానికి పోష‌కాల‌ను అందించే ఈ ఆరు ర‌కాల ఆహార ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బ‌రువు త‌గ్గ‌డానికి స‌హాయ‌ప‌డే ఆహార ప‌దార్థాల్లో పెస‌ర‌ప‌ప్పు కూడా ఒక‌టి. దీనిలో ప్రోటీన్స్, ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. పెస‌ర‌ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల కోలిసిస్టోకినిక్ అనే హార్మోన్ ఉత్ప‌త్తి అవుతుంది. ఇది పొట్టను నిండుగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

Weight Loss Foods take these for better results
Weight Loss Foods

అంతేకాకుండా పెస‌ర‌ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు వేగంగా క‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వల్ల కూడా మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు పొట్ట కూడా నిండుగా ఉంటుంది. త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌దు. అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు చియా విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్త‌నాల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు బ‌రువు త‌గ్గ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అదే విధంగా రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. రాగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. రాగుల‌తో రొట్టె, జావ వంటి చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అదే విధంగా ఉసిరికాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

ఇందులో ఉండే ప్రోటీన్ మ‌రియు ఫైబ‌ర్ ఆక‌లిని త‌గ్గించ‌డంలో బ‌రువు త‌గ్గ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే క్యాలీప్ల‌వ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. క్యాలీప్ల‌వ‌ర్ లో క్యాలరీలు త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే త‌క్కువ మొత్తంలో ప్రోటీన్ ఉన్న‌ప్ప‌టికి బ‌రువు త‌గ్గ‌డంలో ఇది కూడా స‌హాయ‌ప‌డుతుంది. అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఇందులో ఫైబ‌ర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో ఇది ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని అలాగే పోష‌కాహార లోపం కూడా త‌లెత్త‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts