Lemon Tea : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే లెమ‌న్ టీ.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Lemon Tea : లెమ‌న్ టీ.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందాలంటే లెమ‌న్ టీ ని త‌ప్ప‌కుండా తాగాల‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. నిమ్మ‌ర‌సం వేసి చేసే ఈ లెమ‌న్ టీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి కొత్త శ‌క్తి వ‌చ్చిన‌ట్టుగా ఉంటుంది. బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. రీ ఫ్రెష్ అవ్వాలంటే ఈ టీ ని త‌ప్ప‌కుండా తాగాలి. లెమ‌న్ టీ ని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. నిమిషాల వ్య‌వ‌ధిలోనే దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ లెమ‌న్ టీ ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లెమ‌న్ టీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – 300 ఎమ్ ఎల్, పంచ‌దార – రెండున్న‌ర టీ స్పూన్స్, టీ పౌడ‌ర్ – ఒక టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర టేబుల్ స్పూన్, న‌ల్ల ఉప్పు – చిటికెడు, తుల‌సి ఆకులు లేదా పుదీనా ఆకులు – 3 లేదా 4.

Lemon Tea recipe in telugu make in this way
Lemon Tea

లెమ‌న్ టీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీళ్లు, పంచ‌దార వేసి పెద్ద మంట‌పై వేడి చేయాలి. ఈ నీటిని 5 నిమిషాల పాటు బాగా మ‌రిగించిన త‌రువాత టీ పౌడ‌ర్ వేసి క‌లుపుతూ ఒక నిమిషం పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ డికాష‌న్ ను వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఒక గ్లాస్ లో నిమ్మ‌ర‌సం, బ్లాక్ సాల్ట్ ను వేసుకోవాలి. త‌రువాత 125 ఎమ్ ఎల్ డికాష‌న్ ను పైనుండి ఎత్తి పోసుకోవాలి. త‌రువాత ఇందులో తుల‌సి ఆకులు లేదా పుదీనా ఆకులు వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే లెమ‌న్ టీ త‌యార‌వుతుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీర బ‌డ‌లిక త‌గ్గుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

D

Recent Posts