Joints Pains Juice : నేటి తరుణంలో కీళ్ల నొప్పులు అనేవి చాలా మందికి సర్వ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు కేవలం పెద్దలకు మాత్రమే వచ్చే ఈ నొప్పులు ఇప్పుడు పిల్లలకు, యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా వస్తున్నాయి. అందుకు కారణం విటమిన్లు, ఇతర పోషకాల లోపమే అని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే కీళ్ల నొప్పులు వచ్చాయని దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే.. కింద చెప్పిన సహజ సిద్ధమైన పదార్థాలతో జ్యూస్‌ను తయారు చేసుకుని రోజూ తాగితే దాంతో కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ జ్యాస్ ఏమిటో, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.
కీళ్ల నొప్పుల జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు..
దాల్చిన చెక్క, పైనాపిల్, ఓట్స్, నీరు, ఆరెంజ్ జ్యూస్, తేనె
జ్యూస్ తయారీ విధానం..
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని ఓట్స్ వేసి ఉడికించాలి. ఓట్స్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అనంతరం పైన చెప్పిన దాల్చిన చెక్క, పైనాపిల్, ఆరెంజ్ జ్యూస్, తేనెలను తగినంత భాగాల్లో తీసుకుని అన్నింటినీ కలపాలి. ఈ మిశ్రమంలో అవసరం అనుకుంటే కొంత నీరు పోసి ముందు ఉడికిన ఓట్స్‌ను కూడా వేయాలి. అనంతరం దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. దీంతో జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్‌ను తాగేయాలి. ఇలా రోజూ తాగాల్సి ఉంటుంది. దీంతో కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఇప్పటికే మోకాళ్ల నొప్పులకు మందులను వాడే వారు కూడా ఈ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగితే మందులను వాడడాన్ని క్రమంగా ఆపేయవచ్చు. పైన చెప్పిన జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దీంట్లో సిలికాన్, బ్రొమైలైన్, విటమిన్ సి, మెగ్నిషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. కీళ్లు బలంగా, దృఢంగా మారుతాయి.