Radish Raita : ముల్లంగి అంటే మనలో చాలా మందికి ఇష్టం ఉండడు. కానీ దీని వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముల్లంగిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెలుప రకం కాగా మరొకటి ఎరుపు రంగులో ఉంటుంది. అయితే మనకు తెలుపు రంగు ముల్లంగి ఎక్కువగా లభిస్తుంది. ఈ క్రమంలోనే ముల్లంగితో అనేక వంటకాలను కూడా చేస్తుంటారు. అయితే ముల్లంగితో ఎంతో రుచికరమైన రైతాను తయారు చేసి తినవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ముల్లంగి రైతాను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్లంగి రైతా తయారీకి కావల్సిన పదార్థాలు..
ముల్లంగి మీడియం సైజ్ కలవి – 3, పెరుగు – 1 కప్పు, నూనె – 1 టీస్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – కొన్ని ఆకులు, ఆవాలు – పావు టీస్పూన్, మినప పప్పు – పావు టీస్పూన్, ఇంగువ – చిటికెడు, ఉప్పు – రుచికి తగినంత.
ముల్లంగి రైతాను తయారు చేసే విధానం..
ముల్లంగిని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అనంతరం బాగా తురిమి జ్యూస్ తీయాలి. అందులో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. చిన్న పాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేయాలి. చిటపడలాడాక మినప పప్పు వేసి వేయించాలి. అలాగే ఎండు మిర్చి, కరివేపాకులు కూడా వేసి వేయించాలి. చివరగా ఇంగువను వేయాలి. అనంతరం ఇంకాస్త నూనె వేసి మిగిలిన పదార్థాలను వేసి అందులోనే ముల్లంగి, పెరుగు మిశ్రమం వేయాలి. బాగా కలపాలి. దీంతో ముల్లంగి రైతా రెడీ అవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా అన్నంతో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ముల్లంగి అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు.