Mint Cucumber Drink : వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా పుదీనా, కీర‌దోస డ్రింక్‌.. దీన్ని రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు..!

Mint Cucumber Drink : వేస‌వి మ‌రింత ముందుకు సాగింది. దీంతో ఎండ‌లు బాగా మండిపోతున్నాయి. కాలు బ‌య‌ట పెట్టాలంటేనే జ‌నాలు భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక త‌ప్పనిస‌రి ప‌రిస్థితిలో బ‌య‌ట‌కు వెళ్లేవారు జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ వెళ్తున్నారు. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. అయితే పుదీనా, కీర‌దోస‌తో త‌యారు చేసే ఓ డ్రింక్‌ను తాగితే బ‌య‌ట‌కు వెళ్లినా ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం అన్న‌ది ఉండ‌దు. శరీరం చ‌ల్ల‌గా ఉంటుంది. ఇక ఆ డ్రింక్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Mint Cucumber Drink very easy to make healthy
Mint Cucumber Drink

పుదీనా, కీర‌దోస డ్రింక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెరుగు – రెండు క‌ప్పులు, కీర‌దోస – ఒక‌టి చిన్న‌ది, పుదీనా ఆకుల త‌రుగు – రెండు పెద్ద టీస్పూన్లు, అల్లం – చిన్న ముక్క‌, వేయించిన జీల‌క‌ర్ర పొడి – అర టీస్పూన్‌, న‌ల్ల ఉప్పు – అర టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌.

పుదీనా, కీర‌దోస డ్రింక్ త‌యారు చేసే విధానం..

ముందుగా పుదీనా, అల్లం, కీర‌దోస త‌రుగును మిక్సీలో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా పెరుగును చిక్క‌ని మ‌జ్జిగ‌లా చేసుకోవాలి. ఇప్పుడు ప‌దార్థాల‌న్నింటినీ ఓ గిన్నెలో వేసి బాగా క‌లిపి గ్లాసులో పోసి ఐస్ ముక్క‌లు వేస్తే చాలు. ఎంతో చ‌ల్ల‌ని రుచిక‌ర‌మైన పుదీనా, కీర‌దోస డ్రింక్ రెడీ అవుతుంది. ఎండ‌లో బ‌య‌ట‌కు వెళ్లేవారు లేదా బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చిన వారు దీన్ని తాగితే శ‌రీరంలోని వేడి మొత్తం పోతుంది. అయితే ఐస్ ముక్క‌లు వ‌ద్ద‌నుకునేవారు చ‌ల్ల‌ని నీళ్ల‌ను ఉప‌యోగించి ఈ డ్రింక్‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. లేదా త‌యారు చేశాక ఒక గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు.. చ‌ల్ల చ‌ల్ల‌ని డ్రింక్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Admin

Recent Posts