Cardamom With Water : మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాల్లో యాలకులు కూడా ఒకటి. భారతీయులు వీటిని చాలా కాలంగా వంటల్లో వాడుతున్నారు. యాలకులు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. వీటిని వాడడం వల్ల మనం చేసే వంటల రుచి మరింత పెరుగుతుందనే చెప్పవచ్చు. కేవలం రుచిని, వాసననే కాకుండా యాలకులు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. పలు రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో యాలకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. యాలకులను తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి అలాగే యాలకులను ఏవిధంగా తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజూ రెండు యాలకులను ఉదయం పరగడుపున లేదా రాత్రి సమయంలో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనకు మందులను వాడే అవసరమే ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా యాలకులను తీసుకోవడం వల్ల మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఒకటైన అధిక బరువు సమస్య నుండి మనం చాలా సులభంగా బయట పడవచ్చు. అంతేకాకుండా వ్యర్థ పదార్థాలు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. అదేవిధంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణంకాక అజీర్తి, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా యాలకులను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
రాత్రి పూట యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలగడంతోపాటు చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉదయం పూట యాలకులను తీసుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు, మూత్రంలో మంట, ఇన్ ఫెక్షన్స్ వంటి తదితర సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. రక్తహీనత సమస్యను తొలగించే పోషకాలు యాలకుల్లో అధికంగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ విధంగా యాలకులను తీసుకోవడం వల్ల సమస్య ఉండి త్వరగా బయటపడవచ్చు.
దంత సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా యాలకులు మనకు సహాయపడతాయి. యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనల్ని వేధించే అన్ని రకాల దంత సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. యాలకులను, దాల్చిన చెక్క పొడిని నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిలో గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా యాలకులను తీసుకోవడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని వీటిని ఉపయోగించడం వల్ల సమస్యలు తగ్గు ముఖం పట్టడంతోపాటు భవిష్యత్తులో రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.