Fenugreek Seeds : మెంతులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. వీటిని కూరల్లో వేస్తుంటారు. అలాగే ఊరగాయల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి మెంతులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మెంతులను ఎంతో పురాతన కాలం నుంచి పలు వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. మెంతుల సహాయంతో షుగర్, బీపీ, యూరిక్ యాసిడ్, రక్తహీనత, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
2. మెంతుల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, రైబో ఫ్లేవిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఎ, బి6, సి, కె వంటి పోషకాలు మెంతుల్లో అధికంగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందువల్ల మెంతులను రోజూ తీసుకోవాలి.
3. మెంతులను నీటిలో వేసి పేస్ట్‌లా చేసి దాన్ని జుట్టుకు బాగా రాయాలి. గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.
4. మెంతుల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. అందువల్ల మెంతులను తింటుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే కార్బొహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తాయి. దీంతో అన్నం తిన్న వెంటనే షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవచ్చు. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
5. మెంతులను తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.
6. డయాబెటిస్ ను మాత్రమే కాదు కొలెస్ట్రాల్ లెవల్స్, బీపీని తగ్గించడంలోనూ మెంతులు బాగానే పనిచేస్తాయి. అందుకు గాను రోజూ రాత్రి పూట మెంతులను ఒక గుప్పెడు మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని పరగడుపునే తాగాలి. అనంతరం ఆ మెంతులను తినాలి. ఇలా రోజూ చేయడం వల్ల షుగర్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్, బీపీ తగ్గుతాయి. అయితే ఇలా చేయలేని వారు మెంతులను పొడిగా చేసి మజ్జిగలో కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. దీంతోనూ ముందు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు.
7. మెంతుల వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు తెల్లగా ఉంటే నల్లగా మారుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గౌట్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
8. వాత వ్యాధులను తగ్గించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. న్యూరాల్జియా, పక్షవాతం, మలబద్దకం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, శరీరంలో ఇతర ఏ భాగంలో అయినా నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను మెంతులు తగ్గిస్తాయి. అందువల్ల మెంతులను తప్పకుండా రోజూ తీసుకోవాలి.
9. మెంతులను తీసుకోవడం వల్ల కఫ సమస్యలైన దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్, ఛాతి పట్టేయడం, అధిక బరువు వంటి సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు.
10. మెంతులు వేడిచేసే తత్వాన్ని కలిగి ఉంటాయి. కనుక మోతాదుకు మించి తీసుకోరాదు. అలాగే ముక్కు నుంచి రక్తస్రావం అయ్యేవారు, పీరియడ్స్‌లో రక్తస్రావం అధికంగా అయ్యేవారు మెంతులను తీసుకోరాదు.
ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తినాలి. లేదా మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని టీ రూపంలో తాగవచ్చు. అలాగే రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో లేదా నీటిలో ఒక టీస్పూన్ మెంతుల పొడిని కలిపి తాగవచ్చు.
మెంతులను నీటితో కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని పెరుగు లేదా కలబంద గుజ్జుతో కలిపి జుట్టుకు అప్లై చేయవచ్చు. తరువాత తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు, జుట్టు సమస్యలు తగ్గుతాయి. శిరోజాలు నల్లగా మారుతాయి. మెంతులను పొడి చేసి అందులో రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద రాయాలి. డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే మొటిమలు, మచ్చలు, ముడతలపై ఈ మిశ్రమాన్ని రాస్తే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.