Eggs : కోవిడ్ వ‌చ్చిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే.. రోజూ గుడ్ల‌ను తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Eggs : ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ దాదాపుగా ఒమిక్రాన్ ప్ర‌భావం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఈ వేరియెంట్ గ‌త వేరియెంట్ల క‌న్నా ఎన్నో రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే ఈ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ప్ప‌టికీ సెకండ్ వేవ్‌లో వ‌చ్చిన వేరియెంట్ అంత ప్రాణాంత‌కం కాద‌ని అంటున్నారు. ఒక వేళ వ్యాప్తి చెందినా క‌నీస జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం ద్వారా ప్రాణాపాయ ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ వ‌చ్చిన‌వారు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవ‌డంతోపాటు మంచి పోష‌కాలు కలిగిన ఆహారాల‌ను రోజూ తీసుకోవాల‌ని, స‌రైన టైముకు మందుల‌ను వేసుకోవాల‌ని, దీంతో త్వ‌ర‌గా కోవిడ్ నుంచి రిక‌వ‌రీ అవ్వొచ్చ‌ని వైద్యులు చెబుతున్నారు.

eat Eggs daily if you want to recover quickly from covid

సాధార‌ణంగా కోవిడ్ నుంచి రిక‌వ‌రీ అయ్యేందుకు ఎవ‌రికైనా స‌రే 14 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటే కోవిడ్ నుంచి కోలుకునేందుకు మ‌రికాస్త ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది. అయితే కోడిగుడ్ల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు మందుల‌ను వాడ‌డం ఎంత ముఖ్యమో స‌రైన డైట్‌ను పాటించ‌డం కూడా అంతే ముఖ్యం. దీంతో త్వ‌ర‌గా రిక‌వ‌రీ అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇక ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకోవచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే రోజూ గుడ్డును తిన‌డం వ‌ల్ల ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయ‌ని అంటున్నారు.

కోడిగుడ్ల‌లో సెలీనియం, విట‌మిన్లు ఎ, బి, కెలు ఉంటాయి. ఇవి కోవిడ్‌పై పోరాడేందుకు స‌హాయ ప‌డ‌తాయి. కోడిగుడ్ల‌లో అమైనో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో శ‌రీరం వైర‌స్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. అందువ‌ల్లే కోవిడ్ వ్యాప్తి చెందిన వారు రోజూ కోడిగుడ్ల‌ను తినాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

జ‌లుబు, ఫ్లూ ఇన్ఫెక్ష‌న్‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు గుడ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప్రోటీన్ల వ‌ల్ల కండ‌రాలు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి. క‌రోనా వ‌చ్చిన‌వారు కండ‌రాల నొప్పుల బారిన ప‌డ‌తారు. కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల కండ‌రాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతోపాటు కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు.. అని ఢిల్లీ అపోలో స్పెక్ట్రాకు చెందిన డైటిషియ‌న్ దీక్ష అరోరా తెలిపారు.

కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుడ్ల‌లో ఉండే విట‌మిన్ డి, జింక్‌, సెలీనియం, విట‌మిన్ ఇలు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో హార్మోన్లు స‌మ‌తుల్యం అవుతాయి. షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. కోడిగుడ్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల కోలిన్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇది నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

కోవిడ్ వ‌ల్ల గుండెపై కూడా ప్ర‌భావం ప‌డుతుంది. కానీ గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఫోలేట్ ల‌భిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది. కోడిగుడ్ల‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకునేలా చేస్తాయి. అలాగే గుడ్ల‌లో విట‌మిన్లు బి2, బి12, డి అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు రోజూ కావ‌ల్సిన పోష‌కాలు. మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

కోడిగుడ్ల‌లో జింక్‌, మెగ్నిషియం, ఐర‌న్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల గుడ్ల‌ను తింటే శ‌క్తి ల‌భిస్తుంది. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. కోవిడ్ బారిన ప‌డిన‌వారు రోజుకు క‌నీసం 2 ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Share
Editor

Recent Posts