Black Sesame Seeds : చ‌లికాలంలో న‌ల్ల నువ్వుల‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసుకోండి..!

Black Sesame Seeds : చ‌లి పులి రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. గ‌త కొద్ది రోజుల నుంచి చ‌లి విప‌రీతంగా పెరిగింది. దీంతో చాలా మంది త‌మ శ‌రీరాల‌ను వెచ్చ‌గా ఉంచుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే చ‌లి మంట‌లు వేసి శ‌రీరాల‌ను కాపుకోవ‌డం, వేడి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు.

you should eat daily Black Sesame Seeds in winter know the reason

అయితే చ‌లికాలంలో న‌ల్ల నువ్వుల‌ను క‌చ్చితంగా తీసుకోవాల‌ని డైటిషియ‌న్లు సూచిస్తున్నారు. వీటిలో కాల్షియం, ప్రోటీన్లు, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, కాప‌ర్‌, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ నువ్వుల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

కొంద‌రు చిన్న ప‌నిచేసినా త్వ‌ర‌గా అల‌సిపోతుంటారు. అలాంటి వారిలో పోష‌కాల లోపం ఉంద‌ని గ్ర‌హించాలి. వారు న‌ల్ల నువ్వులను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య చ‌లికాలంలో మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఈ సీజ‌న్‌లో న‌ల్ల నువ్వుల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి. వీటిల్లో ఉండే ప్రోటీన్లు, పోష‌కాలు శ‌రీరానికి శ‌క్తిని అందిస్తాయి. దీంతో అంత త్వ‌ర‌గా అల‌సిపోరు. ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు.

న‌ల్ల నువ్వుల్లో కాల్షియం స‌మృద్ధిగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. క‌నుక ఈ నువ్వుల‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. ఈ సీజ‌న్‌లో చాలా మంది కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతుంటారు. అలాంటి వారు రోజూ న‌ల్ల నువ్వుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది. నొప్పులు, వాపుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

పైల్స్ స‌మ‌స్య ఉన్న‌వారికి న‌ల్ల నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. ఈ సీజ‌న్‌లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. దీంతోపాటు పైల్స్ కూడా బాధిస్తుంటాయి. అలాంటి వారు న‌ల్ల నువ్వుల‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. పైల్స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

న‌ల్ల నువ్వుల‌ను ఉద‌యాన్నే బాగా న‌మిలి తినాలి. దీంతో దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి స‌మ‌స్య‌లు పోతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

చ‌లికాలంలో గుండె సంబంధ స‌మ‌స్య‌లు స‌హజంగానే ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. వాటిని నిరోధించి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే న‌ల్ల నువ్వుల‌ను రోజూ తీసుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్త‌నాళాల‌ను వెచ్చ‌గా ఉంచుతుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డి ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

న‌ల్ల నువ్వుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది. మృదువుగా మారి మెరుస్తుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న‌, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న‌వారు రోజూ న‌ల్ల నువ్వుల‌ను ఆహారంలో చేర్చుకోవాలి. దీని వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

న‌ల్ల నువ్వుల‌ను రోజూ గుప్పెడు మోతాదులో నేరుగా తిన‌వ‌చ్చు. పెనంపై వాటిని కొద్దిగా వేయించి తింటే రుచిక‌రంగా ఉంటాయి. లేదా వాటిని పొడి చేసి దాన్ని ఆహారాల్లో చేర్చి కూడా తీసుకోవ‌చ్చు.

Admin

Recent Posts