నోరు బాగా దుర్వాస‌న వ‌స్తుందా.. ఇలా చేయండి..!

నోటి దుర్వాసన సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. దంత సమస్యలు ఉన్నా, లేకున్నా.. నోటి దుర్వాసన  ఉంటే నలుగురిలోనూ మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే ఇందుకు విచారించాల్సిన పనిలేదు. కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ క్రమంలో నోట్లో ఉండే బాక్టీరియా కూడా నాశనం అవుతుంది. మరి ఆ చిట్కాలు ఏమింటే…

bad breathing home remedies in telugu

* పెరుగులో స‌మృద్ధిగా ఉండే ప్రొబ‌యోటిక్స్ నోట్లో ఉండే బాక్టీరియాను నాశ‌నం చేస్తుంది. దీంతో నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోరు తాజాగా మారుతుంది.

* గ్రీన్ టీలో ఉండే పాలిఫినాల్స్ అన‌బ‌డే స‌మ్మేళ‌నాలు నోట్లో దుర్వాస‌న‌కు కార‌ణ‌మ‌య్యే బాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. క‌నుక నోరు దుర్వాస‌న వ‌స్తుంటే ఒక క‌ప్పు గ్రీన్ టీ తాగాలి.

* క్యాప్సికం తిన‌డం వ‌ల్ల కూడా నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. ఇందులో ఉండే విట‌మిన్ సి నోట్లోని బాక్టీరియాను నాశ‌నం చేసి నోరు వాస‌న రాకుండా చూస్తుంది.

* నోటి దుర్వాసన ఎక్కువ‌గా ఉంటే ఒక యాపిల్ పండు తినాలి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నోట్లో ఉండే చెడు బాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. దీంతో నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

* దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లను పోగొట్ట‌డ‌మే కాదు, నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించ‌డంలోనూ ల‌వంగాలు అద్భుతంగా ప‌నిచేస్తాయి. నోరు బాగా వాస‌న వ‌స్తుంటే ఒక ల‌వంగం మొగ్గ‌ను న‌మ‌లాలి. దీంతో ఆ స‌మ‌స్య నుంచి వెంట‌నే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* నోటి దుర్వాస‌నను త‌గ్గించు‌కోవాలంటే సోంపును తినాలి. సోంపులో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు నోట్లో ఉండే బాక్టీరియాను నాశ‌నం చేస్తాయి. దీంతో నోరు వాస‌న రాకుండా ఉంటుంది.

Share
Admin

Recent Posts