కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలివే.. వీటిని తరచూ తీసుకోవాలి..!

మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. కాల్షియం వల్ల నిజానికి ఎముకలకే కాదు.. నాడీ వ్యవస్థకు, కండరాలకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. అందువల్ల నిత్యం కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. దీంతో ఆయా ప్రయోజనాలు పొందవచ్చు.

calcium rich foods in telugu

* కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పాలు. పాలు సులభంగా జీర్ణం అవుతాయి. దాంట్లో ఉండే పోషకాలను మన శరీరం సులభంగా గ్రహిస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాల్లో పాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. చిన్నారులు, పెద్దలు ఎవరికైనా సరే.. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం కావాలి. అందుకు పాలు తాగాలి. నిత్యం ఒక కప్పు పాలను తాగడం వల్ల 280 మిల్లీగ్రాముల కాల్షియం మనకు లభిస్తుంది. ఇది నిత్యం మనకు కావల్సిన 1000 మిల్లీగ్రాముల కాల్షియం కోటాలో కొంత వరకు భర్తీ చేస్తుంది.

* నారింజ పండ్లను తినడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఇందులో కాల్షియం, విటమిన్‌ డి కూడా ఉంటాయి. అందువల్ల నారింజ పండ్లను తింటే శరీరం కాల్షియాన్ని శోషించుకుంటుంది. ఒక మీడియం సైజ్‌ నారింజ పండులో 60 మిల్లీగ్రాముల వరకు కాల్షియం ఉంటుంది.

* సార్డిన్స్‌ అనబడే ఉప్పు నీటి చేపల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. నాన్‌ వెజ్‌ ఇష్టంగా తినేవారు ఈ చేపలను తినాలి. వీటిని పాస్తాలు, సలాడ్లలో తింటే మనకు కావల్సిన కాల్షియం లభిస్తుంది. ఒక కప్పు సార్డిన్‌ చేపల్లో 569 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.

* కేవలం పాలు, పాల సంబంధ పదార్థాల్లోనే కాదు, సోయా మిల్క్‌లోనూ కాల్షియం ఉంటుంది. ఇందులో మనకు కాల్షియం, విటమిన్‌ డి రెండూ లభిస్తాయి. ఒక కప్పు సోయా మిల్క్‌లో 60 మిల్లీగ్రాముల వరకు కాల్షియం ఉంటుంది.

* ఒక కప్పు రోస్ట్‌ చేయబడిన బాదంపప్పులో 457 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఈ పప్పును తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే కాల్షియం ఎక్కువగా లభిస్తుంది.

* అత్తిపండ్లలోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు డ్రై అత్తి పండ్లలో 242 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది.

* పెరుగులో ఉండే కాల్షియం కూడా మనకు మేలు చేస్తుంది. నిత్యం ఒక కప్పు పెరుగు తినడం వల్ల 400 మిల్లీగ్రాముల కాల్షియం పొందవచ్చు.,

* నిత్యం ఆకుపచ్చని కూరగాయలను తినడం వల్ల కూడా కాల్షియం లభిస్తుంది. ఒక కట్ట కూరల్లో 336 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది.

* చీజ్‌లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు చీజ్‌లో 951 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.

Share
Admin

Recent Posts