Beauty Tips : వయసు పెరుగుతున్న కొద్దీ మనం చర్మం రంగు మారుతుంది. ముఖం కళ తప్పుతుంది. మన శరీరం కూడా చాలా రకాలుగా మారుతూ వస్తుంది. మన ముఖాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవడం కొంచెం కష్టమే. అయితే కొన్ని రకాల ఫేస్ ఫ్యాక్ లను వాడితే మాత్రం మన చర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచుకోవడం ఏమంత కష్టం కాదు. చర్మాన్ని ఎప్పుడూ ఒకే విధంగా ఉంచే ఫేస్ ఫ్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫేస్ ఫ్యాక్ ను తయారు చేసుకోవడానికి గాను మనం ఆస్ప్రిన్ టాబ్లెట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆస్ప్రిన్ టాబెట్లను ఫేస్ ఫ్యాక్ లో ఉపయోగించడమేంటి అని సందేహం మనలో చాలా మందికి కలిగే ఉంటుంది. దీనిని జ్వరం, నొప్పులు, రుమాటిక్ ఫీవర్, కీళ్ల వాపు వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ టాబ్లెట్ తో ముఖ సౌందర్యం కూడా పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. జ్వరాన్ని, నొప్పులను నివారించడంలోనే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా అద్భుతంగా పని చేస్తుంది.
ఆస్ప్రిన్ టాబ్లెట్ ను ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలతో వాటి వల్ల కలిగే మచ్చలను కూడా తొలగించుకోవచ్చు. అంతేకాకుండా సూర్యరశ్మి వల్ల కలిగే చర్మ సంబంధిత మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు తొలగిపోతాయి. ఆస్ప్రిన్ టాబ్లెట్లతో వేసిన మాస్క్ చాలా శక్తివంతంగా, వేగంగా పని చేస్తుంది. అయితే దీనిని ఒక్కో చర్మతత్వం ఉన్న వారు ఒక్కో విధంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా జిడ్డు చర్మం ఉన్న వారు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ఆస్ప్రిన్ టాబ్లెట్ ను ముందుగా పొడిగా చేయాలి. తరువాత దీనికి తగినంత నీళ్లను, టీ ట్రీ ఆయిల్ ను కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని రాసుకునేటప్పుడు కంటికి తగలకుండా జాగ్రత్త పడాలి. ముఖానికి రాసుకున్న ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత నీటితో కడిగేయాలి. పొడి చర్మం ఉన్న వారు దీనిలో టీ ట్రీ ఆయిల్ కు బదులుగా బాదం నూనెను కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ విధంగా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అదే విధంగా సూర్యరశ్మి వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చిన వారు ఈ టాబ్లెట్ లను మరో విధంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఆస్ప్రిన్ టాబ్లెట్ లను పొడిగా చేసి దానిలో పెరుగు, నిమ్మ రసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. దీనిని కూడా 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా తరచూ ఆస్ప్రిన్ టాబ్లెట్ లను ఉపయోగించడం వల్ల ఆయా చర్మ సంబంధిత సమస్యలు తగ్గి ముఖం కాంతివంతంగా, అందంగా తయారవుతుంది.