Black Heads Removal Remedies : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. బ్లాక్ హెడ్స్ ఇట్టే పోతాయి..!

Black Heads Removal Remedies : ఒక చిన్న చిట్కాను వాడి మ‌నం చాలా సుల‌భంగా మ‌న ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను, వైట్ హెడ్స్ ను తొల‌గించుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. మ‌న‌లో చాలా మంది బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇవి ఎక్కువ‌గా ముక్కు, గ‌డ్డం, నుదురు వంటి భాగాల్లో వ‌స్తూ ఉంటాయి. వీటి వల్ల ఎటువంటి నష్టం లేన‌ప్ప‌టికి బ్లాక్ హెడ్స్ కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా క‌న‌బడుతుంది. ముఖాన్ని స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, చ‌ర్మంపై మురికి, మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా బ్లాక్ హెడ్స్ వ‌స్తూ ఉంటాయి. జిడ్డు చ‌ర్మం ఉన్న వారిలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది.

చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఖ‌రీదైన క్రీముల‌ను వాడుతూ ఉంటారు. పార్ల‌ర్స్ కి వెళ్లి ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా సుల‌భంగా ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే చిన్న చిట్కాను త‌యారు చేసి వాడ‌డం వ‌ల్ల బ్లాక్ హెడ్స్ ను తొల‌గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ జార్ లో పుదీనా ఆకులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో పావు చెక్క నిమ్మ‌ర‌సం, టూత్ పేస్ట్, ప‌సుపు వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ ఉన్న చోట వేడి నీటితో శుభ్రంగా క‌డ‌గాలి.

Black Heads Removal Remedies follow these
Black Heads Removal Remedies

త‌రువాత 5 నిమిషాల పాటు ఆవిరి ప‌ట్టాలి. త‌రువాత దీనిపై పుదీనా పేస్ట్ ను రాసి సున్నితంగా మ‌ర్దనా చేసుకోవాలి. దీనిని అర‌గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. త‌రువాత కొద్దిగా బ‌ర‌క‌గా ఉండే వ‌స్త్రాన్ని తీసుకుని బ్లాక్ హెడ్స్ పై రుద్దాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ్లాక్ హెడ్స్ తొల‌గిపోతాయి. ఇలా వ‌రుస‌గా మూడు రోజుల పాటు చేయ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా సుల‌భంగా ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను, వైట్ హెడ్స్ ను తొల‌గించుకోవ‌చ్చు.

D

Recent Posts