Darkness On Neck : మనలో చాలా మందికి ముఖం తెల్లగా ఉన్నప్పటికి మెడ చుట్టూ చర్మం నల్లగా ఉంటుంది. మనలో చాలా మంది ముఖం అందంగా ఉంచుకోవడానికి చూపినంత శ్రద్ధను ఏ ఇతర భాగాలపై చూపించరు. దీంతో మెడ, మోచేతులు, మోకాళ్లు వంటి భాగాల్లో చర్మం నల్లగా మారిపోతుంది. అలాగే ఎండలో ఎక్కువగా తిరగడం, చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, అధిక బరువు, థైరాయిడ్ వంటి వివిధ కారణాల చేత కూడా మెడ చుట్టూ చర్మం నల్లగా మారుతుంది. మెడ చుట్టూ చర్మం నల్లగా ఉండడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తనప్పటికి ఇది చూడడానికి అందవిహీనంగా ఉంటుంది. మెడ చుట్టూ నల్లగా ఉండడం వల్ల నచ్చిన బట్టలు వేసుకోలేక ఇబ్బందిపడుతూ ఉంటారు. మెడ చుట్టూ చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో మెడ చుట్టూ నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. మెడ చుట్టూ చర్మాన్ని తెల్లగా మార్చే చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల కాఫీ పొడిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ పంచదారను తీసుకోవాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడ చుట్టూ రాసుకోవాలి. అయితే దీనిని రాసుకోవడానికి ముందు మెడను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకుని 5 నిమిషాల పాటు సర్క్యులర్ మోషన్ లో మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత నీటితో కడిగి వేయాలి.
ఇలా చేయడం వల్ల మెడ చుట్టూ చర్మంపై ఉండే మురికి, మృత కణాలు తొలగిపోతాయి. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల చర్మంపై ఉండే నలుపు తగ్గి చర్మం తెల్లగా మారుతుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించడం వల్ల మనం మెడ చుట్టూ ఉండే చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను పాటిస్తూనే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అధిక బరువు సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. థైరాయిడ్ సమస్య అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా మెడ చుట్టూ చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.