Facepack For Unwanted Hair : ఈ ప్యాక్‌ను వాడితే చాలు.. ముఖంపై ఉండే వెంట్రుక‌లు ఇట్టే పోతాయి..!

Facepack For Unwanted Hair : మ‌న‌లో చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. శ‌రీరంలో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అవాంఛిత రోమాల వ‌ల్ల‌ తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి ముఖం అంద విహీనంగా క‌న‌బ‌డుతుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి లేజ‌ర్ చికిత్స‌ను తీసుకుంటూ ఉంటారు. దీని వ‌ల్ల ఫ‌లితం ఉన్న‌ప్ప‌టికి ఇది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. అయితే లేజ‌ర్ ట్రీట్ మెంట్ కు బ‌దులుగా మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఫేస్ ప్యాక్ ల‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే వీటిని వాడడం వ‌ల్ల ఎలాంటి నొప్పి, ఎలాంటి దుష్ప్ర‌భావాలు ఉండవు. చ‌ర్మానికి కూడా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

అవాంఛిత రోమాల స‌మ‌స్య‌ను త‌గ్గించే ఫేస్ ప్యాక్ ల గురించి అలాగే వాటిని ఎలా త‌యారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అవాంఛిత రోమాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఓట్స్ ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ పొడిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో అర‌టిపండు వేసి అంతా క‌లిసేలా మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల పాటు బాగా మ‌ర్దనా చేసుకోవాలి. ఇది ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల అవాంఛిత రోమాలు తొల‌గిపోతాయి.

Facepack For Unwanted Hair how to use this must know
Facepack For Unwanted Hair

చ‌ర్మంపై పేరుకుపోయిన మురికి, మృత‌క‌ణాలు కూడా తొల‌గిపోతాయి. అలాగే ఒక గిన్నెలో కోడిగుడ్డును తెల్ల‌సొన‌ను తీసుకోవాలి. ఇందులో త‌గినంత బియ్యంపిండి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య తొల‌గిపోతుంది. అవాంఛిత రోమాల‌ను తొల‌గించ‌డంలో బొప్పాయి పండు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. ఇందులో ఉండే ప‌పైన్ అనే ఎంజైమ్ అవాంఛిత రోమా ల‌కుదుళ్ల‌ను విచ్చినం చేసి వాటి పెరుగుద‌ల‌ను ఆరిక‌డుతుంది. దీని కోసం ఒక గిన్నెలో బొప్పాయి పండు గుజ్జును తీసుకుని అందులో కొద్దిగా ప‌సుపును వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల అవాంఛిత రోమాల స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇక ఒక గిన్నెలో నిమ్మ‌ర‌సాన్ని, పంచ‌దార‌ను తీసుకుని వేసి 3 నిమిషాల పాటు వేడి చేయాలి. త‌రువాత ఇందులో త‌గినన్ని నీళ్లు పోసి వ్యాక్స్ లాగా అయ్యే వ‌ర‌కు వేడి చేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం వేడిగా ఉన్న‌ప్పుడే అవాంచిత రోమాల‌పై రాసుకోవాలి. త‌రువాత దీనిపై వ్యాక్స్ పేప‌ర్ ను ఉంచి గ‌ట్టిగా వ‌త్తాలి. త‌రువాత ఈ వ్యాక్స్ పేప‌ర్ ను వ్య‌తిరేక దిశ‌లో గ‌ట్టిగా లాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా త్వ‌ర‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలోనే అవాంఛిత రోమాల స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అవాంఛిత రోమాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ ఫేస్ ప్యాక్ ల‌ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

D

Recent Posts