Stretch Marks : స్ట్రెచ్ మార్క్‌ల‌ను సుల‌భంగా తొల‌గించుకునే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..

Stretch Marks : గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో అలాగే ప్ర‌స‌వానంత‌రం కూడా చాలా మంది మ‌హిళ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో పొట్ట‌పై చార‌లు ఏర్ప‌డ‌డం కూడా ఒక‌టి. పొట్ట‌పై చ‌ర్మం సాగే స‌మ‌యంలో అదే విధంగా చ‌ర్మం మ‌ర‌లా సాధార‌ణ స్థితిలోకి వ‌చ్చే స‌మ‌యంలో చ‌ర్మంపై చార‌లు ఏర్ప‌డ‌తాయి. కేవ‌లం మ‌హిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. లావుగా ఉండి బ‌రువు త‌గ్గి సన్న‌గా అయిన త‌రువాత కూడా చ‌ర్మంపై చార‌లు వ‌స్తాయి.

కేవ‌లం పొట్ట మీదే కాకుండా ఇత‌ర శ‌రీర భాగాల‌పై కూడా ఈ చార‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఒక‌ చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా చ‌ర్మంపై ఉండే చార‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు. ప్ర‌సవానికి ముందు అదే విధంగా ప్ర‌స‌వానంత‌రం కూడా మ‌హిళ‌లు ఈ చిట్కాను ఉప‌యోగించ‌వ‌చ్చు. చ‌ర్మంపై చార‌ల‌ను తొల‌గించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం మ‌నం రెండు ప‌దార్థాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

follow this wonderful remedy to remove Stretch Marks
Stretch Marks

ఇందుకోసం ఏదైనా ఒక బేబీ ఆయిల్ ను అలాగే విక్స్ వెపోర‌బ్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఇవి రెండూ కూడా మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో దొరుకుతాయి. ముందుగా ఒక గిన్నెలో అర టేబుల్ స్పూన్ విక్స్ వెపోర‌బ్ ను తీసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బేబీ ఆయిల్ ను వేసి రెండు క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చార‌లు ఉన్న భాగంలో చ‌ర్మంపై వృత్తాకారంలో రాయాలి.

ఈ మిశ్ర‌మాన్ని రాస్తూనే అవి చ‌ర్మంలోకి ఇంకేలా మ‌ర్దనా చేయాలి. ఇలా చేసిన 40 నిమిషాల త‌రువాత స్నానం చేయాలి. ఈ చిట్కాను క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తి రోజూ పాటించ‌డం వ‌ల్ల చాలా త్వ‌ర‌గా చ‌ర్మంపై ఉండే చార‌లు తొల‌గిపోతాయి. ఈ చిట్కా త‌యారీలో బేబీ ఆయిల్ కు బ‌దులుగా కొబ్బ‌రి నూనెను, బాదం నూనెను, ఆలివ్ నూనెను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ విధంగా చ‌ర్మంపై చార‌లు ఉన్న‌వారు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ర్భభావాలు లేకుండానే చ‌ర్మంపై ఉండే చార‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

Share
D

Recent Posts