Pimples : మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా మనలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖంపై మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, నిద్రలేమి, వాతావరణ కాలుష్యం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల, అలాగే గర్భాశయ సమస్యలు ఉన్న స్త్రీలల్లో మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మొటిమల కారణంగా ముఖం అంద విహీనంగా కనబడడంతో పాటు తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది. మొటిమలను తగ్గించుకోవడానికి రకరకాల ఫేస్ వాష్ లను, లేపనాలను వాడుతూ ఉంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో మనం మొటిమలను తగ్గించుకోవచ్చు.
మొటిమలను తగ్గించే ఆ చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి…ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కొబ్బరి నూనెను అలాగే కర్పూరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కర్పూరంలో ఉండే ఔషధ గుణాలు ఇన్ ప్లామేషన్ తగ్గించి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ చిట్కాను వాడడం వల్ల మొటిమల వల్ల కలిగే నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే మొటిమల తాలూకు నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. ఈ చిట్కాను వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి.
తరువాత ఇందులో 4 కర్పూరం బిళ్లను పొడిగా చేసి వేసుకోవాలి. తరువాత నూనెలో కర్పూరం కరిగే వరకు బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వాడే ముందు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత ముఖాన్ని తుడుచుకోవాలి. తరువాత ఈ మిశ్రమంలో దూదిని ముంచి మొటిమలపై, నల్ల మచ్చలపై రాసుకోవాలి. తరువాత ఇలా రెండు మూడు సార్లు రాసుకున్న తరువాత 15 నుండి 20 నిమిషాల పాటు దీనిని ఆరనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత సబ్బు ఉపయోగించకుండా నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. అలాగే ముఖం పై ఉండే మచ్చలు తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది.