Shobhi Machalu : మనకు వచ్చే చర్మ సంబంధమైన సమస్యలలో శోభి మచ్చలు కూడా ఒకటి. ఇవి ఒక చోట ప్రారంభమై శరీరమంతటా వ్యాపిస్తాయి. ఇవి శరీరం పై ఏదో ఒక చోట చిన్నగా తెల్లని మచ్చలా ఏర్పడి క్రమేపీ పెద్దగా అయ్యి శరీరమంతా విస్తరించి శరీరాన్ని శోభితో కప్పేస్తాయి. ఈ మచ్చలు ఎటువంటి ఇబ్బందినీ కలిగించవు. కానీ అవి వ్యాపిస్తూ ఉంటాయి. వీటిని తెల్ల మచ్చలు అని కూడా అంటుంటారు. ఈ మచ్చలు కలిగిన వారిని చాలా మంది వ్యాధి గ్రస్తులుగా భావిస్తూ ఉంటారు. ఈ శోభి మచ్చలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
హార్మోన్ లలో మార్పులు, రోజూ మందులు మిగడం వంటి వాటి వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. అలాగే వేడి శరీరం ఉన్న వారిలో ఈ మచ్చలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మచ్చలు వచ్చిన వెంటనే చికిత్స తీసుకోవడం చాలా మంచిది. లేదంటే ఇవి శరీరం అంతటా వ్యాపించి అందవిహీనంగా తయారు చేస్తాయి. దీని వల్ల మనం మానసిక ఆందోళనకు కూడా గురవుతూ ఉంటాం. ఇవి వచ్చిన తరువాత మందులను వాడడం చాలా మంచిది. ఈ మచ్చలకు ఆయుర్వేదంలో ఎటువంటి మందులు ఉన్నాయి. ఎటువంటి మొక్కలను ఉపయోగించడం వల్ల ఈ మచ్చలను తగ్గించుకోవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శోభి మచ్చలను తగ్గించడంలో ఉత్తరేణి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తరేణి మొక్క వర్షాకాలంలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఉత్తరేణి మొక్కను ఉపయోగించి శోభి మచ్చలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరేణి మొక్క మొత్తాన్ని సేకరించి శుభ్రపరిచి ఎండబెట్టుకోవాలి. దీనిని నిప్పులపై వేసి కాల్చగా వచ్చిన బూడిదను జాగ్రత్తగా సేకరించాలి. ఈ బూడిదను కావల్సిన పరిమాణంలో తీసుకుని దానికి ఆవనూనెను కలిపి పై పూతగా రాయడం వల్ల శోభి మచ్చలు తగ్గుతాయి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా నెలరోజుల పాటు చేయడం వల్ల ఈ మచ్చలు తగ్గుతాయి. ఈ విధంగా ఉత్తరేణి మొక్కను ఉపయోగించి శోభి మచ్చలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.