Beauty Tips : జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుందని మనందరికి తెలిసిందే. కానీ చర్మ సౌందర్యానికి కూడా కొబ్బరి నూనె ఉపయోగపడుతుందని మనలో చాలా మందికి తెలియదు. కొబ్బరి నూనెను ఉపయోగిస్తే ఎటువంటి ఫెయిర్ నెస్ క్రీములను వాడే అవసరమే ఉండదు. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం వయసు తగ్గించి మరింత యవ్వనంగా కనబడేలా చేస్తాయి. కొబ్బరి నూనెను వాడడం వల్ల చర్మం కోమలంగా తయారవుతుంది. కొబ్బరి నూనెను ఎలా వాడితే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం పై ఉండే ముడతలను తొలగించడంలో కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెను చర్మానికి రాసి మర్దనా చేయాలి.
ఇలా చేయడం వల్ల ముడతలు తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మంపై వయసు వల్ల వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి. ఎండలో తిరగడం వల్ల చర్మం నల్లగా అవ్వడంతో పాటు కందిపోతుంది. అలాంటప్పుడు కూడా కొబ్బరి నూనెను చర్మం పై రాసి మర్దనా చేయడం వల్ల చర్మంపై ఉండే నలుపు తొలగిపోవడంతో పాటు ఉపశమనం కూడా లభిస్తుంది. అదే విధంగా కొబ్బరి నూనెలో చక్కెరను వేసి స్క్రబర్ లా ముఖానికి రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
అదే విధంగా నిగనిగలాడే చర్మం కోరుకునే వారు ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి ముఖానికి బాగా పట్టించాలి. 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై ఉండే ట్యాన్ తొలగిపోయి ముఖం అందంగా మారతుంది. అలాగే ప్రస్తుత కాలంలో అవాంఛిత రోమాలతో బాధపడే స్త్రీల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు గోధుమ పిండిలో కొబ్బరి నూనె కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ గా వేసి పూర్తిగా ఆరనివ్వాలి. తరువాత చేత్తో ఈ మిశ్రమాన్ని రుద్దుతూ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉండే అవాంఛిత రోమాలు క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఇలా వారానికి రెండుసార్లు రెండు నెలల పాటు చేయడం వల్ల ముఖం పై ఉండే అవాంఛిత రోమాలు పూర్తిగా తొలగిపోతాయి.
అదే విధంగా చలికాలంలో చర్మం పగిలిపోతుంది అనుకునే వారు నీళ్లల్లో కొబ్బరి నూనెను వేసి ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను కూడా కొబ్బరి నూనెను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనెను తీసుకుని కళ్ల చుట్టూ రాస్తూ సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు తొలగిపోతాయి. అందంగా కనబడడానికి చాలా మంది మేకప్ వేసుకుంటూ ఉంటారు.
వేసుకున్న మేకప్ ను తీయడానికి కూడా క్రీములను వాడుతూ ఉంటారు. క్రీములను రాయడానికి బదులుగా కొబ్బరి నూనెనుఉపయోగించి సులభంగా మంట లేకండా మేకప్ ను తొలగించుకోవచ్చు. కళ్లు అందంగా కనబడడానికి వాడే ఐ లైనర్, మస్కారా, కాటుక వంటి వాటి తయారీలో కూడా కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొబ్బరి నూనెను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.