Cheppulu : చెప్పుల విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం లేదా.. అయితే జాగ్ర‌త్త‌.. అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

Cheppulu : జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం మ‌నిషి జీవితానికి సంబంధించిన ప్ర‌తి అంశానికి ఏదో ఒక గ్ర‌హంతో సంబంధం ముడి ప‌డి ఉంటుంది. మ‌నం ధ‌రించే పాద‌ర‌క్ష‌ణ‌లు కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. పాద‌ర‌క్ష‌ణ‌ల‌కు శ‌నితో సంబంధం ఉంటుద‌ని జీతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే శ‌నితో పీడింప‌బ‌డుతున్న వారిని పాద‌ర‌క్ష‌ణ‌లు దానం చేయ‌మ‌ని పండితులు చెబుతుంటారు. కొన్ని సార్లు జీవితంలో క‌ష్టాలు ఎక్కువ‌వుతుంటాయి. ఎన్ని పూజ‌లు, శాంతి హోమాలు చేసిన దుద‌దృష్టం వెంటాడుతూ ఉంటుంది. దీనికి మ‌న పాద‌ర‌క్ష‌ణలు కూడా కార‌ణం కావ‌చ్చు. మ‌న పూర్వీకులు పాద‌ర‌క్ష‌ణ‌ల గురించి చాలా వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మ‌న పాదాలే మ‌న‌ గ‌మ్యాన్ని వారి పాదాలే సూచిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుంది.

రెండు కూడా ఒకే ప‌రిమాణంలో ఉండే స‌రైన పాద‌ర‌క్ష‌ణ‌లను మాత్ర‌మే ఎంపిక చేసుకోవాలి. దొంగ‌లించిన లేదా బ‌హుమ‌తిగా పొందిన పాద‌ర‌క్ష‌ణ‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ధ‌రించ‌కూడ‌దు. ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డంలో ఈ పాద‌ర‌క్ష‌ణ‌లు ఉప‌యోగ‌ప‌డ‌వు. అదృష్టాన్ని కూడా దొంగ‌లించి ధ‌రించిన పాద‌ర‌క్ష‌ణ‌లు వెన‌క్కు నెడ‌తాయి. దుర‌దృష్టానికి దారి తీస్తాయి. ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లే స‌మ‌యంలో చిరిగిన లేదా పాడైపోయిన పాద‌ర‌క్ష‌ణ‌ల‌ను ధ‌రించ‌కూడ‌దు. అవి అదృష్టాన్ని కూడా దుర‌దృష్టంగా మార్చేస్తాయి. చిగిరిన పాద‌ర‌క్ష‌ణ‌లు మ‌న విజ‌యాన్ని అడ్డుకుంటాయి. మీ ద‌గ్గ‌ర డ‌బ్బు లేకుంటే ఎవ‌రి షూస్ నైనా అడిగి తీసుకు వెళ్లాలే కానీ దొంగ‌త‌నం మాత్రం చేయ‌కూడ‌దు.

follow these vastu tips for Cheppulu or else problems happen
Cheppulu

ఆఫీస్ ల‌కు వెళ్లేట‌ప్పుడు బ్రౌన్ క‌ల‌ర్ లేదా వుడ్ క‌ల‌ర్ ఉండే షూస్ ల‌ను వేసుకుని వెళ్ల‌కూడ‌దు. ప‌రిస్థితులు మ‌న‌కు అనుకూలంగా లేకుంటే అవి మ‌న‌కు మ‌రింత ప్ర‌తికూలంగా మారే అవ‌కాశం ఉంది. క‌నుక ఆఫీస్ ల‌కు బ్రౌన్ క‌ల‌ర్ షూస్ ను ధ‌రించి వెళ్ల‌కూడ‌దు. విద్యాసంస్థ‌లు, బ్యాంకుల‌ల్లో ప‌ని చేసే వారు కాఫీ రంగు లేదా డార్క్ బ్రౌన్ క‌ల‌ర్ షూస్ ను వేసుకుని వెళ్ల‌డం మంచిది కాదు. ఇలాంటి షూస్ ఆదాయ మార్గాల‌పై ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ట‌. ఇక తెల్ల‌రంగు షూస్ వ‌ల్ల సంప‌ద న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంది. అలాగే వైద్య రంగాల్లో, ఇనుము సంబంధించిన రంగాల్లో ప‌నిచేసే వారు తెలుపు రంగు షూస్ ల‌ను అస్స‌లు ధ‌రించ‌కూడ‌దు. అలా ధ‌రిస్తే దుర‌దృష్టం వెంటాడుతుంది.

నీటి సంబంధిత లేదా ఆయుర్వేద రంగాల్లో ప‌ని చేసే వారు బ్లూ క‌ల‌ర్ షూస్ ను ధ‌రించకూడ‌దు. అలాగే బ‌ట్ట‌తో త‌యారు చేసిన షూస్ ను ధ‌రించ‌డం కూడా మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంటికి ఈశాన్య మూల‌న షూ ర్యాక్ ను ఉంచ‌డం మంచిది కాదు. ఉద‌యాన్నే సూర్య కిరణాలు ఈ చోట ప‌డ‌తాయి క‌నుక పాజిటివ్ కిర‌ణాలు ప‌డే చోట ఈ షూస్ ను ఉంచ‌డం మంచిది కాదు. అలాగే ఇంట్లోకి ప్ర‌వేశించేట‌ప్పుడు కుడి వైపు మాత్రమే పాద‌ర‌క్ష‌ణ‌లను విడిచి పెట్టాలి. ఒక‌వేళ ఇంటి ప్ర‌వేశ ద్వారం తూర్పు లేదా ఈశాన్య దిశ‌లో ఉంటే ప్రవేశ ద్వారానికి ద‌గ్గ‌ర్లో షూ ర్యాక్ ను ఉంచ‌కూడ‌దు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ షూను వేలాడ‌దీయ‌కూడ‌దు.

ఇంట్లో కానీ బ‌య‌ట కానీ ఇలా షూల‌ను వేలాడ‌దీయ‌డం వ‌ల్ల మృత్యువు సంభ‌వించే అవ‌కాశంతో పాటు తీవ్ర‌మైన దుర‌దృష్టం వెంటాడే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా కుటుంబ స‌భ్య‌ల‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. అలాగే ఒక షూ పైన మ‌రో షూను ఉంచ‌కూడ‌దు లేదా ఒక షూలో మ‌రొక‌టి దూర్చి పెట్టకూడ‌దు. ఇలా చేయ‌డం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ తొల‌గిపోయి అపాయానికి దారితీసే ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఇంట్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే వారి పాద‌ర‌క్ష‌ణ‌ల‌ను దానం చేయాలి లేదా పూడ్చి పెట్టాలి. అంతేకానీ వాటిని ఇంట్లో ఉంచుకోకూడ‌దు. ఎంత కొత్త షూస్ అయినా స‌రే వాటిని మంచం మీద‌, టేబుల్ మీద అలాగే మంచం కింద ఉంచ‌కూడ‌దు.

అదే విధంగా ఆహారం తీసుకునేట‌ప్పుడు పాద‌ర‌క్ష‌ణ‌లు ధ‌రించ‌కూడ‌దు. ఇది నెగెటివ్ ఎన‌ర్జీని ఆక‌ర్షిస్తుంది. ఇక చెప్పులు దొంగ‌లించ‌బ‌డితే మంచి జ‌రుగుతుంది అనే మూఢ‌న‌మ్మ‌కం కూడా ఉంది. దేవాల‌యాల ద‌గ్గ‌ర చెప్పులు పోతో మంచిద‌ని అంటారు. ఇది కేవ‌లం చ‌ర్మంతో చేసిన చెప్పుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఎందుకంటే శ‌ని ప్ర‌భావం చ‌ర్మం పైన‌, పాదాల‌పైన ఎక్కువ‌గా ఉంటుంది. చ‌ర్మంతో చేసిన పాద‌ర‌క్ష‌ణ‌లు శ‌ని స్థానాలు. క‌నుక అటువంటి చెప్పులు పోగొట్టుకుంటే ఆ వ్య‌క్తి శ‌ని బాధ‌ల నుండి విముక్తి పొంది శుభాన్ని పొందుతాడ‌ట‌. అదేవిధంగా చెప్పుల‌తో ఒక్క‌సారి ఇంట్లోకి ప్ర‌వేశిస్తే 4,21,000 జాతుల బ్యాక్టీరియాను ఇంట్లోకి తీసుకు వ‌చ్చిన వాళ్లం అవుతాము. చెప్పులతో పాటు ఇంట్లోకి వ‌చ్చే ఈ బ్యాక్టీరియాలు అనేక వ్యాధుల‌ను క‌లుగ‌జేస్తాయి. చిన్న పిల్ల‌లు ఉన్న ఇంట్లోకి మాత్రం చెప్పుల‌తో అస్స‌లు ప్ర‌వేశించ‌కూడ‌దు.

Share
D

Recent Posts