Carom Seeds : రోజూ ఒక్క స్పూన్ చాలు.. కొలెస్ట్రాల్ ఉండ‌దు.. గుండె సేఫ్‌.. బ‌రువు త‌గ్గుతారు..!

Carom Seeds : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో వాము కూడా ఒక‌టి. వామును మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. వామును వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు వామును మ‌నం ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. వాము మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వాములో సోడియం, ఐర‌న్, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి9, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు ఇలా అనేక ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. అంతేకాకుండా వాములో యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. వామును తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం, అజీర్తి వంటి జీర్ణ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

వాములో ఉండే థైమాల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. వామును తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉండ‌డంతో పాటు శ‌రీరంలో ఉండే కొలెస్ట్రాల్, ట్రై గ్లిజ‌రాయిడ్ స్థాయిలు కూడా నియంత్ర‌ణ‌లో ఉంటాయి. వామును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. దీంతో పొట్ట ద్గ‌గ‌ర పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. వామును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం శుభ్ర‌ప‌డుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ ల కార‌ణంగా వ‌చ్చే క‌డుపు నొప్పిత‌గ్గుతుంది. వాములో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. ద‌గ్గు, జ‌లుబు వంటి ఇన్ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో వాము అద్భుతుంగా ప‌ని చేస్తుంది.

Carom Seeds here it is how to take them
Carom Seeds

స్త్రీల‌ల్లో నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పుల‌ను త‌గ్గించే గుణం కూడా వాముకు ఉంది. వామును వంట‌ల్లో వాడ‌డంతో పాటు వాము నీటిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఈ ప్ర‌యోజ‌నాల‌న్నింటిని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ వామును వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ నీటిని 5 నిమిషాల పాటు మ‌రిగించి ఆ త‌రువాత వ‌డ‌క‌ట్టుకుని తాగాలి. ఇలా వాము నీటిని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. అనేక అనారోగ్య స‌మ‌స్యల‌ను చాలా సుల‌భంగా మ‌న ద‌రి చేర‌కుండా చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts