Bitter Gourd Juice : డయాబెటిస్.. ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణమైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇది ఒకటి. వృద్ధులతోపాటు యుక్త వయసులో ఉన్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటిస్ వ్యాధి బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకసారి ఈ వ్యాధిబారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ డయాబెటిస్ వ్యాధిని కొన్ని చిట్కాలను వాడడం వల్ల నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ను నియంత్రించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ ను నియంత్రించడంలో కాకరకాయ ఎంతగానో సహాయపడుతుంది. కాకరకాయ రసాన్ని ఒక బకెట్ లో పోసి అందులో పాదాలను ఉంచాలి. ఇప్పుడు ఒక కాలితో మరోకాలికి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా 20 నుండి 25 రోజుల పాటు చేయడం వల్ల కాకరకాయ రుచి నోటికి తియ్యగా తగులుతుంది. ఇది వినగానే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. కానీ ఇది నిజం. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ పద్దతిని అవలంబించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నూటికి నూరు శాతం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది అవలంబించిన 100 మందిలో 99 శాతం మంది చక్కటి ఫలితాలను పొందారు. ఈ పద్దతిని అవలంబిస్తూనే కాకరకాయ జ్యూస్ ను రోజూ ఉదయం అరగ్లాస్ చొప్పున తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ప్రతి రోజూ వాకింగ్, స్లో రన్నింగ్ వంటివి 20 నుండి 30 నిమిషాల పాటు చేయాలి. దీనితోపాటు రోజూ 7 గంటలపాటు కచ్చితంగా నిద్ర పోవాలి. రాత్రి 10 గంటలకే నిద్రపోయి వేకువజామునే నిద్ర లేవాలి. ఏదైనా పని ఉండి రాత్రి అలస్యంగా నిద్రపోయినప్పటికీ ఉదయాన్నే నిద్ర లేవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఉత్సాహంగా పనులను చేసుకోవచ్చు. ఈ పద్దతిని ఆచరించడానికి ముందు చక్కెర స్థాయిలను ఒకసారి పరీక్షించుకోవాలి.
ఈ పద్దతులను పాటిస్తూ మూడు రోజులకొకసారి షుగర్ టెస్ట్ చేసుకుంటూ చక్కెర స్థాయిల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా డయాబెటిస్ ను మనం జిల్లేడు ఆకులను ఉపయోగించి కూడా నియంత్రించుకోవచ్చు. డయాబెటిస్ ను నియంత్రించడంలో జిల్లేడు ఆకులు చక్కగా పని చేస్తాయి. జిల్లేడు ఆకులు మనకు విరివిరిగా లభిస్తాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు రెండు తాజా జిల్లేడు ఆకులను సేకరించాలి. వీటి వెనుక భాగం అరికాళ్లకు తగిలేలా ఉంచి సాక్స్ ను తొడుక్కోవాలి. రెండు కాళ్ల అడుగు భాగంలో కూడా ఇలా జిల్లేడు ఆకులను ఉంచాలి. ఈ ఆకులను రోజంతా అలాగే ఉంచి నిద్రపోయేటప్పుడు మాత్రం తీసేసి పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి.
ఇలా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. జిల్లేడు ఆకులను ఉపయోగించిన వారం తరువాత షుగర్ లెవల్స్ ను పరీక్షించుకోవాలి. షుగర్ స్థాయిల్లో మార్పులు రావడాన్ని మనం గమనించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి. ఈ జిల్లేడు ఆకులను ఉపయోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల షుగర్ వ్యాధిని సులభంగా నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.