Green Beans Fry : బీన్స్ ఫ్రై ఇలా చేస్తే.. ఒక అన్నం ముద్ద ఎక్కువే తింటారు..!

Green Beans Fry : ఫ్రెంచ్ బీన్స్.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటాం. ఈ ఫ్రెంచ్ బీన్స్ ను వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ వంటి వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతోపాటు వీటితో ఎంతో రుచిగా ఫ్రై ని కూడా చేసుకోవ‌చ్చు. ఫ్రెంచ్ బీన్స్ తో ఫ్రై ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – పావు కిలో, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 6 లేదా త‌గిన‌న్ని, చింత‌పండు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, త‌రిగిన ఉల్లిపాయ – 1 (పెద్ద‌ది), నూనె – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Green Beans Fry here it is how to make it
Green Beans Fry

ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ధ‌నియాలు, ఎండుమిర్చి, చింత‌పండు వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి కచ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఈ ముక్క‌ల‌పై మూత‌ను ఉంచి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి.

ముక్క‌లు దాదాపుగా ఉడికిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసి క‌ల‌పాలి. దీనిపై మ‌ర‌లా మూత‌ను ఉంచి మ‌రో ప‌ది నిమిషాల పాటు వేయించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటి వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

D

Recent Posts