Cumin : ఆరోగ్యానికి జీల‌క‌ర్ర ఎంత మంచిదో తెలుసా.. ఇలా చేయండి..!

Cumin : మ‌నం వంట‌ల్లో వాడే దినుసుల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. జీల‌క‌ర్రను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. వంట‌ల రుచి పెండ‌చంతో పాటు జీల‌క‌ర్ర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. జీల‌క‌ర్ర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. చిన్న పిల్ల‌ల‌కు అర టీ స్పూన్ మోతాదులో జీల‌క‌ర్ర క‌షాయాన్ని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో అరుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది.

అలాగే చ‌ర్మం మీద చిన్న చిన్న ద‌ద్దుర్లు వ‌చ్చిన‌ప్పుడు జీల‌క‌ర్ర‌ను, పంచ‌దార‌ను క‌లిపి తిన‌డం వ‌ల్ల చ‌ర్మం పై ద‌ద్దుర్లు త‌గ్గుతాయి. అలాగే పైత్యాన్ని త‌గ్గించ‌డంలో కూడా జీల‌క‌ర్ర మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. అదే విధంగా గ‌ర్భిణీ స్త్రీలు ఏడ‌వ నెల వ‌చ్చిన ద‌గ్గ‌ర నుండి జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ప్ర‌స‌వం త‌రువాత కూడా జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌యం తిరిగి సాధార‌ణ స్థితికి త్వ‌ర‌గా చేరుకుంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాలింత‌లు జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వల్ల వారిలో జీర్ణ శ‌క్తి మెరుగుప‌డ‌డంతో పాటు పాలు తాగే పిల్ల‌ల్లో కూడా జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. అలాగే ఈ జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది. మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

do you know how healthy cumin to us
Cumin

గుండె జ‌బ్బులు మ‌న ద‌రి చేరుకుండా ఉంటాయి. అలాగే ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే శ‌రీరం డీ హైడ్రేష‌న్ కు గురి కాకుండా ఉంటుంది. అలాగే ఈ నీటిని తాగ‌డం వల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా చాలా త‌క్కువ‌గా ఉంటాయి. జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది. అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. అదే విధంగా నెల‌స‌రి స‌మ‌యంలో స్త్రీలు జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల నొప్పుల నుండి మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. జీల‌క‌ర్ర నీటిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ విధంగా జీల‌క‌ర్ర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts