వేడిగా ఉన్నప్పుడు సహజంగానే ఎవరికైనా చెమట పడుతుంది. ఇక మసాలాలు, కారం అధికంగా ఉన్న పదార్థాలను తిన్నప్పుడు, మద్యం సేవించినప్పుడు కూడా చెమట అధికంగా వస్తుంది. అలాగే వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. అయితే కొందరికి చెమట పట్టడం వల్ల శరీరం దుర్వాసన వస్తుంది. కానీ నిజానికి చెమట దుర్వాసన రాదు. శరీరంపై చెమట పట్టే భాగాల్లో బాక్టీరియా ఉండడం వల్లే శరీరం దుర్వాసన వస్తుంది. కనుక ఆ బాక్టీరియాను నిర్మూలించే ప్రయత్నం చేస్తే చాలు.. శరీరం చెమట పట్టినప్పుడు దుర్వాసన రాకుండా ఉంటుంది. అందుకు ఏం చేయాలంటే…
చెమట ఎక్కువగా పట్టే భాగాల్లో నిమ్మరసం రాయాలి. దీని వల్ల అక్కడి చర్మానికి చెందిన పీహెచ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే బాక్టీరియా నిర్మూలించబడుతుంది. దీంతో చెమట వచ్చినా దుర్వాసన రాకుండా ఉంటుంది.
టమాటాల్లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల బాక్టీరియా పెరగకుండా ఉంటుంది. దీంతో శరీరం దుర్వాసన రాకుండా ఉంటుంది. టమాటా గుజ్జును కొద్దిగా స్నానం చేసే నీటిలో వేసి అనంతరం స్నానం చేస్తే శరీరం దుర్వాసన రాకుండా ఉంటుంది.
బేకింగ్ సోడా కేవలం వంటలకే కాదు.. శరీర దుర్వాసనను తగ్గించేందుకు కూడా పనికొస్తుంది. చర్మంపై చెమట పట్టే భాగాల్లో తేమను బేకింగ్ సోడా గ్రహిస్తుంది. దీంతో ఆయా భాగాలు పొడిగా ఉంటాయి. ఈ క్రమంలో బాక్టీరియా కూడా నశిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్‌సోడాను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చెమట పట్టే భాగాల్లో రాయాలి. కొంత సేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తే శరీరం చెమట పట్టినా దుర్వాసన రాకుండా ఉంటుంది.
వెనిగర్ చర్మం పీహెచ్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో చర్మానికి తాజాదనం, చల్లని అనుభూతి కలుగుతుంది. చెమట పట్టినా దుర్వాస రాకుండా ఉంటుంది. కొద్దిగా వెనిగర్ తీసుకుని అందులో ఒక కాటన్ బాల్ ను ముంచి తీయాలి. అనంతరం దాన్ని చెమట పట్టే భాగాల్లో రాయాలి. వెనిగర్ మిశ్రమాన్ని డియోడరెంట్ స్ప్రే గా కూడా ఉపయోగించవచ్చు. దీంతో శరీరం చెమట వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365