కిడ్నీలు మన శరీరంలోని ముఖ్యమైన అవయాల్లో ఒకటి. ఇవి మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతాయి. లేదంటే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి తీవ్రతరం అయితే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి. అందువల్ల కిడ్నీలను మనం సంరక్షించుకోవాలి. వాటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన పదార్థాలు ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి సమస్యలు రావు. మరి కిడ్నీలను శుభ్రం చేసే ఆ ఆహారాలు ఏమిటంటే..
బీట్ రూట్‌ను నిత్యం జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఎంతగానో మేలు జరుగుతుంది. శరీరం.. ముఖ్యంగా కిడ్నీలు శుభ్రమవుతాయి. బీట్‌రూట్‌లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను శుభ్రం చేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. విటమిన్ సి కిడ్నీలను శుభ్రం చేస్తుంది. కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలు మెరుగ్గా పనిచేస్తాయి.
నిత్యం ఉదయాన్నే పరగడుపునే 2 టీస్పూన్ల అల్లం రసం తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలతోపాటు జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు. అలాగే అల్లం రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. కిడ్నీలు శుభ్రంగా మారుతాయి.
కొబ్బరినీళ్లను తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు రావు. కొబ్బరినీళ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అవి కిడ్నీలను సురక్షితంగా ఉంచుతాయి. అయితే కొబ్బరినీళ్లను మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఆ నీళ్లలో ఉండే సోడియం కిడ్నీలకు హాని చేస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ అధిక బరువును తగ్గించడంతోపాటు కిడ్నీల పనితీరును మెరుగు పరుస్తుంది. కిడ్నీల్లో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365