Headache : దీన్ని ఉప‌యోగిస్తే.. ఎంత‌టి త‌ల‌నొప్పి అయినా స‌రే.. 10 నిమిషాల్లో త‌గ్గిపోతుంది..!

Headache : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాటిల్లో త‌ల‌నొప్పి ఒక‌టి. ఇది చాలా మందికి వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, త‌క్కువ స‌మ‌యం పాటు నిద్రించ‌డం, మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తోంది. అలాగే కొంద‌రికి సైన‌స్ కార‌ణంగా కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హజ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

త‌ల‌నొప్పిని త‌గ్గించేందుకు ఆవు నెయ్యి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది మ‌న శ‌రీరంలో వేడిని త‌గ్గిస్తుంది. అలాగే నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను పెంచుతుంది. దీంతో త‌ల‌కు బాగా ర‌క్తం స‌ర‌ఫ‌రా అవుతుంది. ఫ‌లితంగా త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. అలాగే త‌డి సున్నం కూడా త‌ల‌నొప్పిని త‌గ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక ఈ రెండింటినీ క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేసి వాడితే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. ఇక ఈ మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

follow these wonderful remedies for Headache
Headache

ఒక చిన్న బౌల్‌లో అర టీస్పూన్ మోతాదులో ఆవు నెయ్యిని తీసుకోవాలి. అందులోనే ఒక పావు టీస్పూన్ మోతాదులో త‌డి సున్నం క‌ల‌పాలి. ఇక ఈ రెండింటినీ బాగా క‌లిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని నుదుటిపై రాయాలి. త‌రువాత 5 నిమిషాలు అలాగే ఉండాలి. ఈ మిశ్ర‌మాన్ని నుదుటిపై రాసిన త‌రువాత 2 నిమిషాల‌పాటు సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత 5 నిమిషాలు అలాగే ఉండాలి. దీంతో త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. అయితే నొప్పి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటే.. 10 నుంచి 15 నిమిషాల వ‌ర‌కు ఆగాల్సి ఉంటుంది. దీంతో త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

ఇక త‌ల‌నొప్పి బాగా ఉన్న‌వారు సాయంత్రం ఒక బ‌కెట్‌ను తీసుకుని అందులో స‌గం వ‌ర‌కు గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను పోయాలి. అందులో కాస్త ఎప్సం సాల్ట్‌ను వేయాలి. త‌రువాత ఆ బ‌కెట్‌లో కాళ్ల‌ను పెట్టాలి. పాదాలు మునిగేలా చూడాలి. ఇలా 20 నిమిషాల పాటు ఉండాలి. ఇలా చేసినా కూడా శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి త‌ద్వారా త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. దీంతో త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఈ విధంగా ఈ రెండు చిట్కాల‌ను పాటిస్తే త‌ల‌నొప్పి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Editor

Recent Posts