technology

ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో ఏర్పాటు చేస్తున్న యూఎస్‌బీ టైప్‌ సి పోర్టు అంటే ఏమిటో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రిమూవబుల్ మీడియా స్టోరేజ్‌లో యూఎస్‌బీ డ్రైవ్స్‌కు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే&period; తక్కువ వ్యవధిలోనే పెద్ద మొత్తంలో డేటాను కాపీ చేయడం కోసం ఉపయోగించేది మొదలుకొని మీడియా కనెక్టర్స్‌గానూ&comma; స్మార్ట్‌ఫోన్&comma; టాబ్లెట్స్ వంటి డివైస్‌లకు ఉండే చార్జింగ్ పోర్ట్స్‌లోనూ యూఎస్‌బీదే అగ్రస్థానం&period; కాగా ఇటీవలి కాలంలో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది&period; అయితే నిజానికి యూఎస్‌బీ టైప్‌ సి పోర్ట్‌ అంటే ఏమిటి&quest; అది ఎలా పనిచేస్తుంది&quest; అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period; యూఎస్‌బీ 2&period;0&comma; 3&period;0&comma; 4&period;0 ఇలా ఇందులో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్లు వచ్చాయి&period; అయితే వెర్షన్ నంబర్ ఆధారంగా వాటి వేగం&comma; విశిష్టతలు మారుతుంటాయి&period; కానీ ఉపయోగంలో ఉన్నవి రెండు రకాల యూఎస్‌బీ టైప్ పోర్ట్స్&period; అవి టైప్-ఎ&comma; టైప్-బి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి కేవలం ఒక వైపు మాత్రమే కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి&period; రెండో వైపు సరిపోవు&period; అంటే కేబుల్‌ కనెక్టర్‌ను దాని అమరిక ఆధారంగా కచ్చితంగా ఒక వైపుకు ఫిక్స్‌ చేయాలి&period; దాన్ని కిందకు తిప్పి రివర్స్‌లో కనెక్ట్‌ చేయలేం&period; అది పోర్టులో పట్టదు&period; అయితే కొత్తగా వచ్చిన యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ద్వారా కేబుల్‌ కనెక్టర్‌ను ఎటైనా కనెక్ట్ చేసుకునేందుకు వీలుంటుంది&period; పైకి&comma; కిందకు తిప్పి ఎటంటే అటు యూఎస్‌బీ టైప్‌ సి కేబుల్‌ ను కనెక్ట్‌ చేసుకోవచ్చు&period; ఎందుకంటే ఈ పోర్ట్ ఆకారం రెండు వైపులా ఒకే విధంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81851 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;usb-type-c&period;jpg" alt&equals;"what is usb type c port and how it works " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ విశేషాలు… రివర్సిబుల్ ప్లగ్ ఓరియెంటేషన్‌గా పిలవబడే ఈ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా డేటాను అధిక వేగంతో కాపీ చేసుకునేందుకు వీలుంది&period; ప్రస్తుతం చలామణీలో ఉన్న యూఎస్‌బీ వెర్షన్‌à°² కంటే ఇది 10 రెట్లు ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది&period; 10జీబీపీఎస్ గరిష్ట వేగాన్ని ఇది అందుకోగలదు&period; చార్జర్స్ మీద ఆధారపడకుండా ల్యాప్‌టాప్&comma; స్మార్ట్‌ఫోన్ వంటి డివైస్‌లకు ఆన్ ది గో లో కూడా వేగంగా చార్జింగ్ చేసుకునే విధంగా ఈ పోర్ట్‌ను తీర్చిదిద్దారు&period; యాపిల్ మాక్ బుక్‌లో ముందుగా ఈ యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ డెవలప్ అవగా ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న అనేక ల్యాప్‌టాప్స్&comma; స్మార్ట్‌ఫోన్స్&comma; కెమెరాలు&comma; కీబోర్డులు&comma; ప్రింటర్స్&comma; స్కానర్స్&comma; టీవీలు వంటి అన్ని పరికరాల్లోనూ ఈ పోర్ట్‌ను ఆయా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రత్యేకమైన అడాప్టర్ సహాయంతో హెచ్‌డీఎంఐ&comma; వీజీఏ వంటి పోర్ట్స్‌కు దీన్ని కనెక్ట్ చేసేలా డివైస్‌లను రూపొందిస్తున్నారు&period; దీంతో ఆయా పోర్ట్‌లకు ఇది ఇన్‌పుట్&comma; ఔట్‌పుట్ పరికరంగా పనిచేయనుంది&period; ఎక్కువ కేబుల్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు గాను యూఎస్‌బీ టైప్‌ సి పోర్టును తీర్చిదిద్దుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts