వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా….? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు డైరెక్టర్ సార్…!

ఒకప్పుడు సినిమాల్లో వచ్చిన మిస్టేక్ లను ప్రేక్షకులు పెద్దగా గుర్తించేవారు కాదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరగడం ఓటిటీలో సినిమాలు అందుబాటులో ఉండటంతో చిన్న చిన్న మిస్టేక్ లను సైతం ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేకర్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా సర్కారు వారి పాట సినిమాపై కూడా అలాంటి ట్రోల్స్ వస్తున్నాయి.

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అయితే సినిమాకు కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి. ఇక ఈ సినిమా ఆ త‌రువాత‌ ఓటిటి లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. దాంతో ఓటీటీలో కూడా సర్కారు వారి పాటకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బ్యాంకుల మోసాల నేపథ్యంలో సర్కారు వారి పాట తెరకెక్కింది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ యాక్షన్ సీన్ లో దర్శకుడు లాజిక్ మిస్ అయ్యాడు. మహేష్ బాబు లారీ తో వచ్చే సీన్ లో మొదటి సారి ఇద్దరు రౌడీలను ఢీ కొడతాడు.

have you noticed this small mistake in sarkaru vari pata movie

అయితే లారీ మరికొంత ముందుకు వెళ్ళినప్పుడు కూడా ముందు ఢీకొట్టిన రౌడీలనే మళ్లీ డీ కొడతాడు ఈ మిస్టేక్ ను నెటిజన్లు పట్టుకున్నారు. దాంతో ఒకసారి లారీ కింద పడ్డ వాళ్లే మళ్లీ ఎలా వచ్చారు సార్….? అంటూ దర్శకుడు పరశురామ్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత పెద్ద సినిమాలో చిన్న లాజిక్ ను అలా ఎలా మిస్సయ్యారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Admin

Recent Posts