Nails Grow Home Remedies : ఈ చిట్కాల‌ను పాటిస్తే మీ గోళ్లు ఎంతో పొడ‌వుగా పెరుగుతాయి.. అందంగా ఉంటాయి..!

Nails Grow Home Remedies : మ‌న‌లో చాలా మంది గోళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. గోళ్లు స‌రిగ్గా పెర‌గ‌వు. దీంతోపాటు గోళ్లు చిట్లిపోయి క‌నిపిస్తాయి. ఇది చూసేందుకు ఎంతో అంద విహీనంగా ఉంటుంది. దీని వల్ల ఇబ్బందులు ప‌డుతుంటారు. న‌లుగురిలోనూ తిరిగేందుకు కూడా అవ‌స్థ ప‌డుతుంటారు. అయితే కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల గోళ్లు ఆరోగ్యంగా మారుతాయి. అలాగే గోళ్లు పొడ‌వుగా కూడా పెరుగుతాయి. దీంతో గోళ్లు అందంగా క‌నిపిస్తాయి. ఇక గోళ్ల‌ను పెంచుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల నిమ్మ‌ర‌సం.. అంతే మోతాదులో ఆలివ్ నూనె వేయాలి. ఈ రెండింటినీ బాగా క‌ల‌పాలి. త‌రువాత ఆ మిశ్ర‌మంలో గోళ్ల‌ను ముంచి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం గోళ్ల‌ను తీసి వాటిని అలాగే ఉంచాలి. 5 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఇలా రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా వారం పాటు చేయాలి. దీంతో గోళ్లు ఆరోగ్యంగా మారుతాయి. గోళ్లు పొడ‌వుగా పెరుగుతాయి. అలాగే గోళ్ల‌కు పెట్రోలియం జెల్లీని రాసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత క‌డిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేయాలి. దీంతో గోళ్లు పొడ‌వుగా పెరుగుతాయి.

Nails Grow Home Remedies in telugu make them healthy
Nails Grow Home Remedies

గోళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో.. గోళ్ల‌ను పెంచ‌డంలో కొబ్బ‌రినూనె కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక గిన్నెలో కాస్త కొబ్బ‌రి నూనెను తీసుకుని వేడి చేయాలి. అందులో గోళ్ల‌ను ముంచాలి. వాటిని ముంచి ఉన్న‌ప్పుడే మ‌సాజ్ చేయాలి. ఇలా 10 నిమిషాల పాటు చేయాలి. త‌రువాత క‌డిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. గోళ్లు అందంగా మార‌డ‌మే కాదు.. పొడ‌వుగా పెరుగుతాయి కూడా. అలాగే ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేయాలి. అందులో అంతే మోతాదులో ఆలివ్ నూనెను కూడా వేయాలి. ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపి అందులో గోళ్ల‌ను ముంచాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాక గోళ్ల‌ను బ‌య‌ట‌కు తీసి క‌డ‌గాలి. ఇలా వారంలో 3 సార్లు చేయాలి.

ఇలా పైన తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల గోళ్లు అందంగా మార‌డ‌మే కాదు.. ఎంతో పొడ‌వుగా పెరుగుతాయి కూడా. గోళ్లు చిట్ల‌డం త‌గ్గుతుంది. ఇక గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే పైన తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం మాత్ర‌మే కాకుండా పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. జింక్ అధికంగా ఉండే కోడిగుడ్లు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, బాదంప‌ప్పు, జీడిప‌ప్పు వంటి ఆహారాల‌ను తీసుకుంటున్నా కూడా గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గోళ్ల‌ను పొడ‌వుగా పెంచుకునేవారు వాటిని శుభ్రంగా ఉంచాలి. మ‌ట్టి లేకుండా క్లీన్ చేసుకోవాలి. దీంతో గోళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. చిట్లిపోకుండా ఉంటాయి. పొడ‌వుగా పెరుగుతాయి.

Share
Editor

Recent Posts