చిట్కాలు

Yellow Teeth : రెండే నిమిషాల్లో పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు.. పసుపు పళ్ళకి గుడ్ బై చెప్పేయచ్చు..!

Yellow Teeth : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యకరమైన పద్ధతుల కోసమే చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన నష్టాలు అయితే తప్పవు. ఆరోగ్యం విషయంలో, ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించడం అవసరం. ఇదిలా ఉంటే, ఈ రోజుల్లో చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. పళ్ళు నల్లగా మారిపోవడం, పళ్ళు ఊడిపోవడం ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయి. దాంతో, డెంటిస్టులు దగ్గరికి వెళ్లి, క్యూ కడుతున్నారు.

కొంతమందిలో చూసినట్లయితే, పళ్ళు పచ్చగా మారిపోతూ ఉంటాయి. తెల్లని పళ్ళు పసుపుగా మారిపోతే, చూడడానికి అసలు బాగోదు. పైగా, నవ్వినప్పుడు అసలు బాగా కనపడదు. పళ్ళని తెల్లగా మార్చుకోవాలి అంటే, కొన్ని ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఇలాంటి చిన్న విషయాలకి డెంటిస్ట్ లని సంప్రదించాల్సిన పనిలేదు. ఇంటి చిట్కాలతో, పసుపుగా ఉన్న పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు.

now you can get rid of yellow teeth with in 2 minutes

మరి ఎలా పసుపుపళ్లని తెల్లగా మార్చుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రెండే నిమిషాల్లో, మనం పసుపు పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు. అది ఎలా అంటే, దీని కోసం ముందు అల్లం తీసుకోండి. అల్లం చెక్కు తీసేసి ముక్కలు కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ముక్కని తీసుకుని తురుముకోండి. ఆ తురుములో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి.

ఒక స్పూన్ వరకు మీరు ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. నిమ్మకాయ చెక్కని కూడా కొద్దిగా తురుముకోండి. ఆ తురుమును కూడా ఇందులో మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో దీన్ని బాగా కలుపుకోండి. టూత్ బ్రష్ ని తీసుకుని, టూత్ బ్రష్ మీద ఈ పేస్ట్ ని పెట్టి, పళ్ళని తోమాలి. రెండు, మూడు నిమిషాల పాటు దీంతో పళ్ళని తోమితే, పచ్చగా మారిన పళ్ళు తెల్లగా వచ్చేస్తాయి.

Admin

Recent Posts