Onion And Clay Pot : ప‌చ్చి ఉల్లిపాయ‌.. మ‌ట్టి పాత్ర‌.. అంతే.. షుగ‌ర్ దెబ్బ‌కు అదుపులోకి వ‌స్తుంది..!

Onion And Clay Pot : డ‌యాబెటిస్.. దీనినే షుగ‌ర్ వ్యాధి, మ‌ధుమేహం అని కూడా అంటారు. పేరు ఏదైనా ఈ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. డ‌యాబెటిస్ అనేది ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అసాధార‌ణ గ‌రిష్ట‌ స్థాయిలో ఉండే చాలా అసాధార‌ణ‌మైన వ్యాధిగా చెప్పుకోవ‌చ్చు. ఈ వ్యాధి బారిన ప‌డిన వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డ‌యాబెటిస్ బారిన ప‌డిన వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాల‌లో అధిక దాహం ఒక‌టి. ఈ వ్యాధి బారిన ప‌డిన వారికి త‌ర‌చూ దాహం వేస్తూ ఉంటుంది. సాధార‌ణంగా అధిక దాహం, త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న చేయ‌డం వంటివి మ‌ధుమేహం యొక్క అత్యంత ఖ‌చ్చిత‌మైన ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.

ఈ వ్యాధి బారిన ప‌డిన వారిలో కంటి చూపు త‌గ్గుతుంది. మ‌ధుమేహం కు త‌గిన చికిత్స తీసుకోక‌పోతే కంటిచూపుపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. చూపు కోల్పోవ‌డం, అంధ‌త్వం వంటి వాటికి కూడా షుగ‌ర్ వ్యాధి దారి తీస్తుంది. అలాగే మ‌న శ‌రీరంలో క‌ణాలు త‌గినంత గ్లూకోజ్ పొంద‌డానికి శ‌క్తి కోసం కొవ్వు క‌ణాల‌ను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో మ‌నం బ‌రువు త‌గ్గుతాము. అలాగే ఎక్కువ‌గా ఆక‌లి వేయ‌డం కూడా మ‌ధుమేహ వ్యాధి గ్రస్తుల్లో క‌నిపించే ఒక ల‌క్ష‌ణం. అలాగే ర‌క్తంలో చ‌క్కెర అధిక స్థాయిలో ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. దీంతో మ‌నం అనేక వ్యాధుల బారిన ప‌డ‌డం, శ‌రీరానికి త‌గిలిన గాయాలు, దెబ్బ‌లు త్వ‌ర‌గా మానక‌పోవడం వంటివి జ‌రుగుతాయి. ఈ షుగ‌ర్ వ్యాధిని కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు.

Onion And Clay Pot use them in this way for diabetes
Onion And Clay Pot

షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వ‌కాలంలో మ‌ట్టిపాత్ర‌ల్లో వండుకుని తినే వారు. ఇలా మ‌ట్టి పాత్ర‌ల్లో వండుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌లు రుచిగా ఉండ‌డ‌మే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌ట్టి పాత్ర‌లో వండుకున్న ప‌దార్థాలు చాలా స‌మ‌యం వ‌ర‌కు వాటి రుచిని కోల్పోకుండా తాజాగా ఉంటాయి. మ‌ట్టిలో మ‌న ఆరోగ్యానికి కావ‌ల్సిన 18 ర‌కాల మైక్రో న్యూట్రియ‌న్స్ ఉంటాయి. ఈ మ‌ట్టి పాత్ర‌ల‌ను వేడి చేయ‌గానే మ‌న కంటికి క‌నిపించ‌ని కిర‌ణాలు ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపి ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ పాత్ర‌ల్లో వండుకుని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఈ మ‌ట్టి పాత్ర‌ల్లో వండిన ఆహారాన్ని షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు తీసుకోవ‌డం వ‌ల్ల వారిలో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో వారు డ‌యాబెటిస్ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ఒక నెల రోజుల పాటు మ‌ట్టి పాత్ర‌ల్లో వండుకుని తిన‌డం వ‌ల్ల మ‌ధుమేహాన్ని తగ్గించుకోవ‌చ్చు. అలాగే ఉల్లిపాయ‌ను ఉప‌యోగించ‌డం వల్ల షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ట‌. ఒక్క ఉల్లిపాయ‌తో షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించుకోవ‌చ్చ‌ని సంప్ర‌దాయ ఆయుర్వేదం చెబుతుంది. మందుల‌కు సైతం త‌గ్గ‌ని షుగ‌ర్ వ్యాధిని 50 గ్రాముల ఉల్లిపాయ త‌గ్గిస్తుంది. దీని కోసం మ‌నం చేయాల్సిందల్లా రోజుకు ఒక ఉల్లిపాయ‌ను తిన‌డ‌మే. ఇలా ఏడు రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధిలో వ‌చ్చే మార్పుల‌ను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

రోజుకు 50 గ్రాముల ప‌చ్చి ఉల్లిపాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధిని నియంత్రించుకోవ‌చ్చు. 50 గ్రాముల ప‌చ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో స‌మానం. ఈ ఉల్లిపాయ‌ను ఏడు రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే చాలు ఎంతో కాలం నుండి వేధిస్తున్న షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. 50 గ్రాములు ఒకేసారి తిన‌క‌పోతే ఉద‌యం కొద్దిగా, మ‌ధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి. ఇలా ప‌చ్చి ఉల్లిపాయ‌ను తిన‌లేక‌పోతే అదే ఉల్లిపాయ‌తో ప‌చ్చి పులుసు చేసుకుని అన్నంతో క‌లిపి తినాలి. అలాగే మ‌న ఇంట్లో త‌యారు చేసుకున్నఆరోగ్య‌క‌ర‌మైన జ్యూస్ తో కూడా మ‌నం షుగ‌ర్ వ్యాధిని త‌గ్గించుకోవ‌చ్చు.

ఈ జ్యూస్ ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ రెండు క‌ట్ట‌ల కొత్తిమీర‌ను, రెండు క్యారెట్ ల‌ను, ఒక గ్రీన్ ఆపిల్ ను, అలాగే మ‌న‌కు న‌చ్చిన ఆకుకూర‌ను 3 క‌ట్ట‌ల మోతాదులో తీసుకోవాలి. ముందుగా ఈ ప‌దార్థాల‌న్నింటిని శుభ్రం చేసుకుని ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని ముందుగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి జ్యూస్ లా చేసుకోవాలి. ఈ స‌హ‌జ సిద్ద‌మైన జ్యూస్ షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకోవ‌చ్చు. డ‌యాబెటిక్ ల‌క్ష‌ణాల‌ను నివారించుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. త‌ద్వారా షుగ‌ర్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts