Tea Decoction For Hair : దీన్ని రాస్తే చాలు.. తెల్ల జుట్టు మొత్తం న‌ల్ల‌గా మారుతుంది.. వెంట్రుక‌లు భారీగా వ‌స్తాయి..!

Tea Decoction For Hair : మ‌న ఇంట్లో ఉండే రెండు ప‌దార్థాల‌తో ఈ చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. తెల్ల‌జుట్టు న‌ల్లబ‌డుతుంది. చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే ఈ చిట్కా ఏమిటి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ఆ రెండు ప‌దార్థాలు ఏమిటి.. అలాగే ఈ చిట్కాను ఎలా ఉప‌యోగించాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం రెండు టీ స్పూన్ల టీ పౌడ‌ర్ ను, అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే టీ పౌడ‌ర్ వేసి 5 నుండి 8 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత డికాష‌న్ ను వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సాన్ని పిండి క‌ల‌పాలి.ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మంలో దూదిని ముంచి జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టించాలి. దూది వాడ‌డం క‌ష్టంగా ఉన్న వారు స్ప్రే బాటిల్ ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టించిన త‌రువాత 5 నిమిషాల పాటు సున్నితంగా మ‌ర్ద‌నా చేసుకోవాలి. దీనిని గంట‌పాటు అలాగే ఉంచిన త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. అయితే త‌ల‌స్నానం చేయ‌డానికి షాంపును మాత్రం ఉప‌యోగించ‌కూడ‌దు. ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు రాసుకున్న మ‌రుస‌టి రోజూ షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయ‌డం వ‌ల్ల మ‌నం జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాంటి వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Tea Decoction For Hair know ho to use it
Tea Decoction For Hair

ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. తెల్ల‌జుట్టుతో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను క్ర‌మం త‌ప్ప‌కుండా వాడ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. జుట్టు మృదువుగా, ప‌ట్టు కుచ్చులా త‌యార‌వుతుంది. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా తేలిక‌. దీనిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల అధ్భుత‌మైన ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts