చిట్కాలు

వామును ఎలా తీసుకుంటే ఏయే వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..?

వాముతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిని సుగంధ ద్రవ్యంగా ఆహారంలోనే కాక మందుల తయారీలో కూడా వాడతారు. అతి చిన్నగా వుండి ఇవి కోడి గుడ్డు ఆకారంలో వుంటాయి. ఇవి చేదుగా ఘాటుగా వుంటాయి. వాము ప్రయోజనాలు పరిశీలిస్తే- కొద్దిపాటి వాము మజ్జిగతో తీసుకుంటే అజీర్ణం తగ్గుతుంది. చలికాలం జలుబు, దగ్గులు తగ్గుతాయి. కొద్దిగా నోటిలో వేసుకొని వేడి నీటితో కలిపి నమలాలి. అజీర్ణం వల్ల వచ్చే పొట్ట లేదా పేగుల నొప్పులు, గ్యాస్ సమస్య తగ్గుతాయి.

లివర్, కిడ్నీలు సమస్యలకు కూడా ఇది పనిచేస్తుంది. కిడ్నీ రాళ్ళు కరగాలంటే వాము తినాలి. గుండె, తల, చెవుల‌లో నొప్పులు వాము తింటే తగ్గుతాయి. వాము నూనె కొద్ది చుక్కలు చెవిలో వేయాలి. వాము నూనెతో కీళ్ళ నొప్పులు, నయమవుతాయి. ఆల్కహాలు తాగిన తర్వాత కడుపులో వచ్చే గడబిడలను, వికారాన్ని నియంత్రించేందుకు వాము తినవచ్చు. ఆకలి పెంచుతుంది. భోజనం తర్వాత నమిలితే నోటి దుర్వాసన పోయి జీర్ణక్రియ సాఫీగా వుంటుంది.

this is how you take ajwain for different types of benefits

పండ్లు నొప్పులకు వాము మరిగించిన వేడి నీరు పుక్కిలి పడితే తగ్గిపోతాయి. బహిష్టు నొప్పులకు వాడితే మంచి ఫలితం వుంటుంది. వేయించిన వామును పాలతో తీసుకోవాలి. వేయించిన వాము, జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది. గర్భవతులు రెగ్యులర్ గా తింటే రక్తాన్ని శుభ్రపరచటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సరిగా సాగేలా సహకరిస్తుంది. ఇవన్నీ వాము తినటం వలన వచ్చే ఆరోగ్య లాభాలు. వీటిని పప్పులు, కూరలు, రొట్టెలు, పరోటాలు లేదా వేయించిన పకోడిలలో కూడా వేసి రుచిని ఆరోగ్యాన్ని కలిగించవచ్చు.

Admin

Recent Posts