చిట్కాలు

బియ్యప్పిండి చేస్తుంది కాంతివంతంగా!

మార్కెట్లో దొరికే ఫేస్‌వాష్‌, క్రీములు, లోషన్లు ఇవన్నీ వాడినంతసేపు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత మామూలు పరిస్థితే. ఇలా ఎంతకాలం ఫేస్‌ ప్రాడక్ట్‌నే నమ్ముకుంటారు. పద్దతి మార్చండి. తిరిగి పాతకాలం పద్ధతులు పాటించండి. పాత పద్ధతిలో ఒక పద్ధతిని పరిచయం చేస్తాం. కింది చిట్కాలు చదివి వాటిని ఫాలో అయిపోండి.

బియ్యప్పిండి శరీరాన్ని అందంగా మార్చే గుణం కలిగి ఉంటుంది. దీన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బియ్యంపిండికి కొన్ని రకాల పదార్థాలను కలిపి ముఖానికి రాసుకుంటే కొన్ని రోజుల్లోనే ఊహించని మార్పు చూస్తారు.

– బియ్యప్పిండిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. గిన్నెలో ఒక టేబుల్‌ స్పూన్‌ బియ్యప్పిండి, ఒక టేబుల్‌ స్పూన్‌ అలోవెరా జెల్‌ ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె తీసుకోవాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత బాగా కలిపి ముఖానికి పట్టించాలి. పూర్తిగా ఆరిపోయాక కడిగేస్తే మెరిసే చర్మంమీ సొంతమవుతుంది.

use rice flour in this way for beauty

– గిన్నెలో కొద్దిగా బియ్యప్పిండి తీసుకొని దానికి చిటికెడు బేకింగ్‌ సోడా, టేబుల్‌ స్పూన్‌ తేనె జోడించి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేసి సున్నితంగా మర్దన చేయాలి. బాగా డ్రై అయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

– టేబుల్‌ స్పూన్‌ బియ్యప్పిండి, అరటిపండు గుజ్జు, అర టేబుల్‌స్పూన్‌ ఆముదం నూనె తీసుకోవాలి. వీటిని బాగా మిక్స్‌ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కళ్లకింద రాయాలి. అరగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

– ఒక గిన్నెలో రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండి, సరిపడా పచ్చిపాలు తీసుకొని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేయాలి. అరగంట వరకు అలానే వదిలేయాలి. తర్వాత శుభ్రం చేస్తే మంచిది.

– బియ్యప్పిండి, ఒక టేబుల్‌ స్పూన్‌ కార్న్‌ఫ్లోర్‌, సరిపడా రోజ్‌ వాటర్‌ తీసుకొని బాగా కలుపాలి. ఈ మిశ్రమానికి కొంచెం గ్లిజరిన్‌ వేసి బాగా కలుపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

Admin