Hair Oil : జుట్టు ఊడిన చోట ఈ నూనెతో మ‌సాజ్ చేయండి.. జుట్టు మొలుస్తుంది..

Hair Oil : వ‌య‌సుతో సంబంధం లేకుండా మ‌న‌ల్ని వేధించే స‌మ‌స్య‌ల్లో జుట్టు రాలిపోవ‌డం కూడా ఒక‌టి. మ‌నంద‌రికీ కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. రాలిపోయిన వెంట్రుక‌ల స్థానంలో కొత్త వెంట్రుక‌లు వ‌స్తూ ఉంటాయి. వంద‌కు మించి వెంట్రుక‌లు రాలిపోతూ ఉంటే జుట్టు రాల‌డం స‌మ‌స్య తీవ్ర‌మైన‌దిగా భావించాలి. త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు, ప‌డుకున్న‌ప్పుడు, జుట్టును దువ్వుకున్న‌ప్పుడు వెంట్రుక‌లు రాలిపోతూ ఉంటాయి. ఎక్కువ‌గా వెంట్రుక‌లు రాలిపోతూ ఉంటే మ‌న‌కు జుట్టు రాల‌డం స‌మ‌స్య ఉంద‌ని భావించాలి.

ఈ స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వంశ‌పార‌ప‌ర్యంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే ఒత్తిడి కార‌ణంగా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ జుట్టుకు సాఫీగా సాగ‌దు. దీంతో స‌రైన పోష‌కాలు అంద‌క జుట్టు రాలిపోతూ ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని కూడా జుట్టు రాల‌డానికి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అలాగే క్యాన్స‌ర్, థైరాయిడ్, డ‌యాబెటిస్, ఎనీమియా వంటి వ్యాధుల కార‌ణంగా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. వ‌య‌సు పెర‌గ‌డం, చుండ్రు స‌మ‌స్య‌, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌ వంటి ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా జుట్టు రాలిపోతుంది.

use this Hair Oil to prevent hair fall and grow hair
Hair Oil

మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో నూనెను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు రాల‌డం స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ హెయిర్ ఆయిల్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అలాగే దీనిని ఎలా వాడాలి.. ఈ నూనెను త‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను త‌యారు చేసుకోవ‌డానికి గాను మ‌నం కొబ్బ‌రి నూనెను, బాదం నూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనె, ఆముదం, ఉల్లిపాయ‌, మిరియాలు, వెల్లుల్లిని ఉప‌యోగించాల్సి ఉంటుంది.

కొబ్బ‌రి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు జుట్టు బాగా ప‌రిగేలా చేస్తాయి. చుండ్రును నివారిస్తాయి. అలాగే వెల్లుల్లిలో స‌ల్ఫ‌ర్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి వెంట్రుక‌ల‌ను దృఢంగా చేయ‌డంలోనే కాకుండా కొత్త వెంట్రుక‌లు వ‌చ్చేలా చేస్తాయి. ఆలివ్ నూనెలో విట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఆముదంలో మ‌న జుట్టుకు అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు యాంటీ వైర‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. బాదం నూనె జుట్టును మృదువుగా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఈ నూనెను త‌యారు చేయ‌డానికి గాను ముందుగా ఒక గిన్నెలో కొబ్బ‌రి నూనెను వేసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ఒక గిన్నెలోకి తీసుకుని చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఇందులో నువ్వుల నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెను మ‌నం నిల్వ కూడా చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయ ర‌సాన్ని తీసుకోవాలి. అందులో ముందుగా త‌యారు చేసుకున్న నూనెను వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మంలో దూదిని ముంచి జుట్టు కుదుళ్ల‌కు అంటేలా బాగా రాయాలి. త‌ల‌కు నూనె రాసుకోవాలి అనుకున్న‌ప్పుడ‌ల్లా ఇలా నూనెను త‌యారు చేసుకుని వాడాలి.

ఈ నూనెను జుట్టుకు రాసిన ఒక‌టి లేదా రెండు గంట‌ల త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఈ చిట్కాను పాటించ‌డం వల్ల జుట్టు రాల‌కుండా ఉంటుంది. అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వ‌స్తుంది. అంతేకాకుండా జుట్టుకు సంబంధించిన ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా తొల‌గిపోతాయి.

D

Recent Posts